ఒకే వేదికపైకి చిరంజీవి, పవన్ కల్యాణ్: కనీవినీ ఎరుగని ఏర్పాట్లతో వేడుక

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరిస్తోన్న ఆయన.. మధ్యలో రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్‌ను పూడ్చేందుకు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహా రెడ్డి', 'ఆచార్య' వంటి భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అయితే, గత రెండు చిత్రాలు ఆశించిన రీతిలో ఆడలేదు. అయినప్పటికీ ఆయన ఫలితాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాల మీద సినిమాలను పూర్తి చేస్తూ మెగాస్టార్ జెట్ స్పీడుతో దూసుకెళ్తోన్నారు.

ప్రస్తుతం చిరంజీవి చేస్తోన్న చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' ఒకటి. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ ఇటీవలే టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుని.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

క్రేజీ కాంబినేషన్‌లో పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో బడా స్టార్లను భాగం చేశారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవి సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అలాగే, హీరోను కాపాడే మాఫియా డాన్ రోల్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన రావడంతో పలు రికార్డులు కూడా బ్రేక్ అయిపోయాయి.

 Pawan Kalyan Chief Guest for Godfather Pre Release Event

చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' మూవీని అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటోంది. త్వరలోనే ఇంటర్వ్యూలు కూడా జరపబోతున్నారు. అదే సమయంలో సెప్టెంబర్ చివరి వారంలో 'గాడ్ ఫాదర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. అందుకే ఈ ఫంక్షన్‌ను కనీవినీ ఎరుగని రీతిలో ఎక్కువ మందితో నిర్వహించబోతున్నారని సమాచారం.

'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను చేస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు అదిరిపోయే స్పందన వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X