రవితేజకు పవన్ కల్యాణ్ హెల్ప్.. ఆ ఒక్కడి కోసం డిప్యూటీ సీఎం రెడీ
టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా బీ, సీ సెంటర్లలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. సుదీర్ఘ కాలంగా కమర్షియల్ చిత్రాలతో సత్తా చాటుతోన్న ఆయన.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటున్నారు.
సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న రవితేజ.. ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాను చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా.. హిందీలో భారీ విజయాన్ని అందుకున్న 'రైడ్' మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొనగా.. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందిస్తున్నారు.

రెండు క్రేజీ మూవీల తర్వాత రవితేజ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను గత ఏడాదిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దర్శకుడు హరీష్ శంకర్ పలు షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాడు. అలా ఈ మధ్యనే షూట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుని సినిమాను రిలీజ్‌కు రెడీ చేసేశాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తీసిన 'మిస్టర్ బచ్చన్' మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. దీంతో దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారన్న దానిపైనా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీనికి పవర్ స్టార్ వపన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట. దీనిపై రెండు మూడు రోజుల్లోనే ప్రకటన రాబోతుందని సమాచారం. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ హరీష్ శంకర్ కోరడంతో ఆయన ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











