Saindhav: వెంకటేష్ కోసం పవన్ కల్యాణ్.. మరోసారి గోపాల గోపాల మ్యాజిక్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వేగంగా సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్లో అయిపోయారు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. కొన్ని మూవీలు చేసినా అవి ఓటీటీలో రావడం.. వెబ్ సిరీస్ చేయడం జరిగాయి. దీంతో ఆయన అభిమానులు భారీ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకటేష్ నటించిన చిత్రమే 'సైంధవ్'.
విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ ఫ్రాంచైజీతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమానే 'సైంధవ్'. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించేశారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని జరుపుతూ కంప్లీట్ చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా మొదలు పెట్టి కంప్లీట్ చేసుకున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సైంధవ్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న విషయం తెలిసిందే.
సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న 'సైంధవ్' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని జవనరి మొదటి వారంలోనే జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తాజాగా ఫిలిం నగర్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

వెంకటేష్ హీరోగా నటించిన 'సైంధవ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారన్న దానిపైనా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీనికి పవర్ స్టార్ వపన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. దీనిపై రెండు మూడు రోజుల్లోనే ప్రకటన రాబోతుందని సమాచారం. గతంలో వెంకీ, పవన్ కలిసి 'గోపాల గోపాల' మూవీని చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. 'సైంధవ్' మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. అలాగే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రను చేయగా.. ఆండ్రియా, రుహానీ శర్మ, శ్రీనిథి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











