Varasudu: విజయ్ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. ప్లాన్ వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కు పండగే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ హీరో విజయ్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతని గత సినిమాలు తెలుగు మార్కెట్లో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక తప్పకుండా ఈసారి వారసుడు సినిమాతో అంతకుమించి అనేలా విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. అయితే దిల్ రాజు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన టాక్ కూడా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హయ్యెస్ట్ రెమ్యునరేషన్

హయ్యెస్ట్ రెమ్యునరేషన్

తమిళ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ తో కొనసాగుతున్న విజయ్ ఇప్పుడు వారసుడు సినిమాతో కూడా ఊహించని స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేశాడు. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే అతను 90 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాడు. విజయ్ కెరీర్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక పారితోషికం కావడం విశేషం

బిజినెస్ డీల్స్ క్లోజ్

బిజినెస్ డీల్స్ క్లోజ్

తప్పకుండా వారసుడు సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అని దిల్ రాజు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ తో దాదాపు అన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. అయితే భారీ పెట్టుబడి పెట్టడం వలన ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకు చాలా ముఖ్యం కానుంది. ఇంకా ఎక్కువ స్థాయిలో హైప్ క్రియేట్ చేయగలిగితేనే సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రీ రిలీజ్ ఈవెంట్

అసలే సంక్రాంతి సీజన్ లో ఓవైపు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలకు కూడా మెల్లగా హైప్ అయితే పెరుగుతుంది. కాబట్టి వారసుడు సినిమా నిలదొక్కుకోవాలి అంటే టాక్ అయితే చాలా పాజిటివ్ గా ఉండాలి. అంతకంటే ముందుగా సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ముఖ్యం. ఇక ఆ ఈవెంట్ కోసం ఎవరిని అతిథిగా పిలవాలా అని దిల్ రాజు ప్రణాళికలు రచిస్తున్నారు.

రంగంలోకి పవన్?

రంగంలోకి పవన్?

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ కరమైతే పవన్ కళ్యాణ్ ను వారసుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాలి అని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ విజయ్ బంగారం సినిమాను తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రమోషన్స్ లో కూడా విజయ్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చాడు. అంతేకాకుండా విజయ నటించిన కొన్ని సినిమాలను తెలుగులో పవన్ రీమేక్ చేశాడు. అందులో ఖుషి కూడా ఉంది.

తప్పకుండా వస్తారు.. కానీ..?

తప్పకుండా వస్తారు.. కానీ..?

అయితే వారసుడు సినిమాను తెలుగు తమిళ్లో ఒకేసారి జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక అంతకంటే ముందుగా సినిమా ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించాలని దిల్ రాజు రెడీ అవుతున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా చేయడం వలన ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. ఇక ఇప్పుడు ఆయన పిలిస్తే తప్పకుండా వస్తారు అని చెప్పవచ్చు. అయితే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా పోటీగా ఉంది కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X