షాకింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది జంటలు విడాకులు తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు కామన్ అయిపోయింది. ఇక తాజాగా సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ తన భార్యతో మంజు పిళ్లై విడాకులు తీసుకోబోతున్నారట. స్వయంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన అనేక జంటలు వివాదాల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఒక అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. మలయాళ నటి మంజు పిళ్లై, అలాగే ఆమె భర్త, తెలుగులో నాలుగు సినిమాలు చేసిన సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సుజిత్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

2020లోనే మంజు నుంచి విడిపోయానని, ఈ మధ్య విడాకుల కూడా ప్రక్రియ పూర్తయిందని సుజిత్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే మంజు ఇప్పటికీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని సుజిత్ చెప్పుకువచ్చాడు. 2020 నుంచి విడివిడిగా జీవిస్తున్నామన్న సుజిత్... మేము గత నెలలో విడాకులు తీసుకున్నామని చెప్పుకువచ్చారు. ఇప్పుడు నేను మంజుని స్నేహితురాలు అని పిలవాలనుకుంటున్నాను ఎందుకంటే మా స్నేహం ఇప్పటికీ ఉందని వెల్లడించారు.
మంజు కెరీర్ బాగానే సాగుతోందని అంత సక్సెస్ ఫుల్ గా ఆమె కెరీర్ ను చూసిన ఆనందంగా ఉందని చెప్పుకువచ్చారు. నటి మంజు పిళ్లై మరియు సుజిత్ వాసుదేవన్ 2000లో వివాహం చేసుకోగా... వీరికి దయా అనే కుమార్తె ఉంది. వీరిద్దరూ విడిపోయారనే రూమర్ల్ చాలా కాలంగా వినిపిస్తున్నా ఈ విషయంపై బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారని చెప్పుకువచ్చింది. ఇక ఇటీవల హోమ్, ఫలిమి, జయజయ జయహై వంటి సినిమాలో మంజు పిళ్లై గుర్తుండి పోయే పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
ఇక సుజిత్ వాసుదేవ్ విషయానికి వస్తే... మలయాళంలో లూసిఫర్, ఎంపురాన్ వంటి హిట్ చిత్రాలకు సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.. తెలుగులో ఆయన కీర్తి సురేష్ మిస్ ఇండియా, రవితేజ ఖిలాడీ, రామ్ ది వారియర్, పవన్ బ్రో సినిమాలకు సినిమాటోగ్రాఫీ అందించి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన తన భార్యతో విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











