twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ ని ఒడ్డున పడేయటానికి పవన్ ప్రయత్నం

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ కి వాస్తవానికి సీడెడ్, నెల్లూరు వంటి ఏరియాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి,క్రౌడ్ ఫుల్లింగ్ హీరోగా ఉన్నారు. అయితే క్లాస్ ఆడియన్స్ ని , ఓవర్ సీస్ మార్కెట్ ని ఆయన ఆకర్షించలేకపోచతున్నారు. అదే ఎక్కువగా బ్రూస్ లీకి, గోవిందుడు అందరివాడేలే చిత్రాల కలెక్షన్స్ కి దెబ్బ కొట్టిందంటున్నారు. ఈ విషయమై రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ చర్చించారని దాన్ని దాటటానికి పవన్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుకోసం పవన్ క్రియేటివ్ వర్క్స్ పై ఈ చిత్రం నిర్మాణం జరపనున్నారు.

    ఈ మేరకు పవన్ కళ్యాణ్...త్రివిక్రమ్ తో చర్చించి ప్రాజెక్టు సెట్ చేసాడని చెప్తున్నారు. త్రివిక్రమ్ ,రామ్ చరణ్ కాంబినేషన్ ఖచ్చితంగా క్రేజ్ వస్తుందని, క్లాస్ ఇమేజ్ వస్తుందని భావించే పవన్ ప్లాన్ చేసారంటున్నారు. తని ఒరువన్ రీమేక్ అనంతరం పవన్ నిర్మాతగా ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కిస్తారని తెలుస్తోంది. పవన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కూడా కనిపించే అవకాసం ఉంది. మార్చి 2016లో ఈ చిత్రం ప్రారంభమవుతుంది.

    ' 'తని ఒరువన్‌'' విశేషాలకు వస్తే...

    కొద్ది రోజుల క్రిందట విడుదలై సూపర్ టాక్ తో దూసుకుపోతున్న ' 'తని ఒరువన్‌'' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేయటానికి రంగం సిద్దమయినట్లే అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం రైట్స్ ని ఐదున్నర కోట్లకు పొందినట్లు సమాచారం. తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడు మోహన్ రాజానే మొదట ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసేందుకు అనుకున్నారు. అయితే చివరి నిముషంలో సురేంద్ర రెడ్డి సీన్ లోకి వచ్చారు. మొదట ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం 8-9 కోట్లు వరకూ అడిగారని, అయితే చిరంజీవి సీన్ లోకి వచ్చి ఎడిటర్ మోహన్ తో మాట్లాడటంతో ఈ ప్రాజెక్టుని ఫైనల్ అయినట్లు చెప్తున్నారు.

    బ్రూస్ లీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్... ఈ సినిమా తరువాత కోలీవుడ్ హిట్ మూవీ 'తని ఒరువన్' రీమేక్ లో నటిస్తున్నారు. నిర్మాత దానయ్య ఈ హిట్ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ కోసమే భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశాడని...ఈ ఏడాదిలోనే ఈ రీమేక్ మూవీ సెట్స్ మీదకు వెళ్లొచ్చని వినిపిస్తోంది. ఈ సినిమాకు మెగా ఫోన్ పట్టుకునేది సురేంద్రరెడ్డి అనే క్లారిటీ రావటంతో... హీరోయిన్ గా సమంత పేరు దాదాపుగా ఖరారైందని ప్రచారం మొదలైంది దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా హిట్టే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

    Pawan Kalyan Comes To Ram Charan's Rescue

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కథేంటి... మిత్రన్ ('జయం' రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు.

    ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశం. తమిళంలో చివరి 'నెగటివ్' సినిమా! ఈ సినిమా ఇప్పటికే వసూళ్లు కొల్లగొడుతూంటే, మరో రూపంలో ఇది చరిత్రలో నిలిచిపోనుంది. తమిళంలో 'నెగటివ్' వాడిన చివరి సినిమా ఇదే.

    రామ్ చరణ్ మాట్లాడుతూ...ఇదివరకు రీమేక్‌ సినిమాలు చేయకూడదు అనుకొనేవాణ్ని. కానీ అలాంటి నిబంధనలేవీ పెట్టుకోకూడదనే ఓ నిర్ణయానికొచ్చా. 'తని ఒరువన్‌' నాకు బాగా ఇష్టం. అందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర చాలా ముఖ్యం. ఆ పాత్రకి తగ్గ నటుడు దొరికితే వెంటనే సినిమాని మొదలుపెడతాం. ఆ తర్వాత గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాని చేయబోతున్నా. అదొక ప్రేమకథతో తెరకెక్కబోతోంది.

    అలాగే...పవన్‌కల్యాణ్‌ నిర్మాణంలో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అంటే...ఇటీవలే నేను, బాబాయ్‌ కలిసి మాట్లాడుకొన్నాం. వచ్చే ఏడాది ఆ సినిమా ఉంటుంది.మీ నాన్న, మీ బాబాయ్‌, మీరు... ముగ్గురూ కలిసి నటించే అవకాశాలేమైనా ఉన్నాయా?అలాంటి కలయికలో సినిమా వస్తే బాగుంటుంది. కానీ ముగ్గురూ కలిసి నటించాలంటే అందుకు దీటైన కథ కావాలి. ఇప్పటిదాకా ఏ దర్శకుడూ అలాంటి ప్రతిపాదనతో మా దగ్గరికి రాలేదు. ఒకవేళ వస్తే, కథ బాగుంటే తప్పకుండా చేస్తాం అన్నారు.

    మొత్తం హిందీ, కన్నడ, తెలుగు చిత్ర సీమలను తన వైపు తిప్పుకున్న ఆ చిత్రం పేరు 'తని ఒరువన్'. 'దృశ్యం' తర్వాత మళ్లీ ఓ హాట్ కేక్. మలయాళ 'దృశ్యం' ఇప్పటికే అయిదు భాషల్లో రీమేక్ అయి విజయం సాధించింది. మళ్లీ ఆ సినిమా తర్వాత 'తని ఒరువన్' హాట్ కేక్‌లా మారింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ చేయాలని హేమాహేమీలు ప్లాన్ చేస్తున్నారు.

    తెలుగు నుంచి రామ్‌చరణ్,హిందీ నుంచి సల్మాన్‌ఖాన్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక హీరోయిన్ జెనీలియాకు ఈ సినిమా తెగ నచ్చేసి మరాఠీ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించడానికి సై అన్నారు. బెంగాలీ వెర్షన్ రీమేక్ హక్కుల గురించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. బాలీవుడ్ విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూడలేదు కానీ, ఆయన ప్రొడక్షన్ యూనిట్ ఇప్పటికే ఈ సినిమా చూసి, రీమేక్ రైట్స్ తీసుకోవటం కోసం డిస్కషన్స్ మొదలుపెట్టారని చెప్తున్నారు.

    English summary
    Well! Following Charan's career closely, Pawan Kalyan is said to have come to his rescue with a damage control plan. If the sources are to be believed, Pawan Kalyan has asked his close friend Trivikram to pen a family entertainer for Ram Charan and he himself will be producing the film under Pawan Kalyan Creative Works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X