తీన్ మార్ క్లైమాక్స్ ఫైట్ స్టైలిష్ గా కంపోస్ చేసిన పవన్ కి హ్యాట్సాఫ్..!
'ఖుషీ" తర్వాత వచ్చిన చిత్రాల్లో ఖుషీకి మునుపటి జోరుని ప్రదర్శించని పవన్ కళ్యాణ్ మళ్లీ యువతకి నచ్చే విధంగా ఫుల్ జోష్ లో కనిపించిన చిత్రం 'తీన్ మార్" మాత్రమే. అందుకే ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో యువత హోరే ఎక్కువ కనిపిస్తోంది. బ్రాండ్ పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్ మెంట్ కి కాలేజ్ గోయర్స్ యమగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇక ఖుషీ టైమ్ లో కాలేజ్ స్టూడెంట్స్ అయిన పవన్ ఫ్యాన్స్ మళ్లీఇన్నాళ్లకి పవన్ లో ఆ జోష్ చూసి హ్యాపి ఫీలవుతున్నారు.
ముఖ్యంగా 'తీన్ మార్" క్లైమాక్స్ ఫైట్ పవన్ కంపోజింగ్ చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం 'తీన్ మార్". ఈ చిత్రం రీసెంట్ గా విడుదలై కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్టైల్, ద్విపాత్రాభినయంలో ఆయన నటన, త్రిష, కృతి కర్బందా అందచందాలు, మణిశర్మ వీనుల విందైన సంగీతం, జయంత్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ఘనవిజయాన్ని చేకూర్చాయి.
ఈ 'తీన్ మార్" చిత్రానికి నిజానికి టినూ వర్మ యాక్షన్ సీన్లను కంపోజ్ చేశారు. అయితే ఈ 'తీన్ మార్" చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ ని మాత్రం హీరో పవన్ కళ్యాణే కంపోజ్ చేశారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అందుకే ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ లో ఫైట్ అంత స్టైల్ గా, సహజంగా ఉందని వారంటున్నారు. ఈ విషయాన్ని 'తీన్ మార్" చిత్రం యూనిట్ ఇంకా ధృవపరచలేదు.


Click it and Unblock the Notifications











