పవన్ 'పంజా' కోసం చైనాలో సైతం
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా కోసం చైనాలో సైతం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. యూ ట్యూబ్ లో ఓ వీడియో దీన్ని ధృవీకరిస్తోంది. చైనాలోకి కొందరు స్టూడెంట్స్.. తాము పవన్ పంజా కోసం ఎదురుచూస్తున్నామని, పంజాకి ఆల్ ది బెస్ట్ చెపుతూ అక్కడ సైతం విడుదల చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియో చేసి నెట్ లో పెట్టారు. అది ఇప్పుడు ఇంటర్ నెట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రమూ చైనాలో విడుదల కాలేదు. ఇప్పుడు తెలుగు సినిమాకు ఇదో కొత్త మార్కెట్ అని చెప్తున్నారు. అలాగే ఇంతకాలం రజనీకాంత్ కి జపాన్ లో మార్కెట్ ఉండేది. ఆ మధ్య జూ ఎన్టీఆర్ కి చెందిన అశోక్ పాటలు కూడా అక్కడ ప్రాచుర్యం పొందయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కి చైనాలో మార్కెట్ ఏర్పడటం అందరనీ ఆశ్చర్యంలో పడేస్తోంది.
పవన్ కల్యాణ్ 'పంజా' లో సారాజేన్ డయాస్, అంజలీ లావనియా హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. తమిళ దర్శకుడు విష్ణువర్థన్ ఈ చిత్రానికి దర్శకుడు. మర్యాదరామన్న నిర్మించిన సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్త నిర్మాణంలో నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 19న పాటలు విడుదల కానున్నాయి. పవన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబరు 9న సినిమాను విడుదల చేయనున్నారు. బ్రహ్మానందం, భరణి, అలీ, జాకీ ష్రాప్, అతుల్ కులకర్ణి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, కెమెరా: పి.ఎస్.వినోద్.


Click it and Unblock the Notifications











