For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ నిర్మాణ రంగంలోకి పవన్ కళ్యాణ్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారా? సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించబోతున్నారా? అంటే అవుననే గాసిప్స్ వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్లో...

    'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో సదరు ప్రొడక్షన్ హౌస్ మొదలవ్వనుందని చర్చించుకుంటున్నారు. దీని ద్వారా టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంతో పాటు చిన్న, భారీ బడ్జెట్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారటన పవర్ స్టార్.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో. ఎంత టాప్ హీరో అయినా.... కొన్నాళ్ల వరకు మాత్రమే. అన్నయ్య చిరంజీవి లాగా వయసు పైబడ్డాక సినిమాల నుంచి తప్పుకోక తప్పదు. అయితే రాజకీయాలంటే ఇంట్రస్టులేని పవన్ కళ్యాణ్ భవిష్యత్‍‌లో సినీ నిర్మాణ రంగంలో రాణించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. అదే విధంగా దర్శకత్వంపై కూడా దృష్టి పెట్టనున్నాడట.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలోనటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య యూనివర్స్ మీడియా పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఆడియో విడుదల చేసి అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Pawan Kalyan is man of Multiple Talents.There is a speculation in media circles that Pawan Kalyan is going to launch a production house named as Pawan Kalyan Creative works.In which he wanted to encourage & introduce new talent to the film industry.Pawan Kalyan wanted to produce small as well as Big budget movies & also if time permits he is interested in Direction also.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X