For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్..విడాకులు? మరో స్త్రీతో డేటింగ్?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‍గా మారి పోయారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఆయన గురించే వార్తలు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుంచి నేషనల్ వెబ్ పోర్టల్స్ వరకు పవర్ స్టార్ 'ఉమనిజం' గురించి కోడై కూస్తున్నాయి.

  ఇప్పటికే మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పవన్...రేణు దేశాయ్‌తో కొంతకాలం సహజీవనం చేసి...ఆమెను తల్లిని చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ మూడో సెటప్ పెట్టారని వార్తలు గుప్పుమన్నాయి. తనతో పాటు తీన్ మార్ చిత్రంలో నటించిన 'డానా మార్క్స్' అనే రష్యన్ యువతితో కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడని, వీరు అమ్మానాన్నలు కూడా అయ్యారని, 3 నెలల పాపాయి ఉందని.. తెలుగు న్యూస్ చానల్స్‌తో పాటు నేషనల్ మీడియా వెబ్ సైట్స్ క్వశ్చన్ మార్క్ తో కూడిన కథనాలు వెలువరించాయి.

  ఇటీవల జరిగిన పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజున హైదరాబాద్‌లో లేట్‌నైట్‌ పార్టీకి డానా మార్క్స్‌తో కలిసి రావడంతో అక్కడ కొంతమంది మీడియావారు చూసి ఆశ్చర్యపోయారని, ఇది తన వ్యక్తిగతమని పవన్‌ అన్నట్లు తెలిసింది. దాంతో వార్త దావాలనంలా వ్యాపించింది.

  డానా మార్క్స్ 'తీన్‌మార్‌'లో ఓ పాత్ర పోషించింది. రొమాన్స్‌ సన్నివేశాల్ని ఆమె పండించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. ఈమె కోసం జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి దగ్గరలోనే పవన్‌ ఓ బంగ్లాను కొనడమే కాకుండా అందులో ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

  కొంత కాలంగా పవన్ కళ్యాణ్-రేణు దేసాయ్ కలిసుండటం లేదని, ఆమె పూణెలోనే ఉంటోందని, త్వరలో ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ద అవుతున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ ఇందుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ విషయాలను ఎవరూ కూడా అధికారికంగా ధృవీకరించలేక పోతున్నారు. భిన్నమైన వ్యక్తిత్వం గల హీరోగా పేరు తెచ్చుకున్న పవర్ స్టార్....... ఇలాంటి వ్యవహారాల్లోనూ తన ప్రత్యేకతను చాటు కోవడం కొస మెరుపు. ఏది ఏమైనా ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

  English summary
  Pawan Kalyan, who turned 42 yesterday, is making it to the headlines for all wrong reasons. The actor, who is said to have parted his ways with his wife Renu Desai, has a live-in relationship with his Teen Maar co-star Danah Marks. The Tollywood star even has alleged love child with the actress. Pawan Kalyan met Danah Marks on the sets of movie Teen Maar, which was a remake of Love Aaj Kal and he reportedly fell in love with her. "Pawan and Danah fell in love on the sets of Teen Maar and have been living together. They are now the parents of a three-month-old baby girl," Times of India quotes a source as saying. According to the TOI reports, Pawan Kalyan and Danah Marks have been living together in a house on Road No. 12 in Banjara Hills. Their neighbours say that they have seen Danah taking the baby in a stroller for a walk. They even say that she gets along well with Pawan's two children, who shuttle between Pune and Hyderabad and often stay with Pawan and Danah.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X