ఆ ఫోటో ఎఫెక్ట్: చిరు-పవన్ రిలేషన్‌పై సరికొత్త చర్చ!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి, ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి మధ్య అభిప్రాయ విబేధాలు వచ్చాయనే ప్రచారం గతకొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఇద్దరూ చెరో దారి చూసుకోవడం కూడా ఇలాంటి ప్రచారానికి మరో కారణం.
అయితే తాజాగా ఇంటర్నెట్లో దర్శనం ఇస్తున్న ఫోటో ఒకటి.....సరికొత్త చర్చకు దారి తీస్తోంది. అన్నదమ్ములు ఇద్దరూ...కుటుంబ విషయాలను, రాజకీయ విషయాలను వేర్వేరుగా చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూసారుగా.... చిరంజీవి వెంట ఉన్న పాపాయి పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య.
పవన్ -రేణు దేశాయ్ లు విడిపోయినప్పటికి పిల్లలు మాత్రం ఇద్దరు కూడా ఇద్దరి దగ్గరా ఉంటున్నారు. కొద్ది రోజులు ఇక్కడ మరికొద్ది రోజులు అక్కడ పూణే లో ఉంటున్నారు. ఇక ఇక్కడ ఉంటున్న సమయంలో అడపాదడపా చిరు ఇంటికి కూడా వెళుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం షూటింగుకు వెళ్లిన చిరంజీవి వెంట పవన్ కూతురు ఆద్యా కూడా ఉన్నారని, ఈ ఫోటో అక్కడిదే అని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications