విసుగెత్తిపోయిన పవన్.. ఆలోపు షూట్ పూర్తి చేయాలంటూ నిర్మాతకు డెడ్ లైన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసే ముందు తాను ఇక సినిమాల్లో నటించను అని ప్రకటించారు. దీంతో ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెప్పారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన గెలవకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు ప్లాన్ చేశారు. అయితే ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మూడేళ్ల సమయంలో కేవలం రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.

ఇక కరోనా దానికి ఒక కారణం అయినా సరే ప్రస్తుతానికి ఒక సినిమా విషయంలో పవన్ విసిగెత్తిపోయారని తెలుస్తోంది.. దీంతో పవన నిర్మాతలకు డెడ్ లైన్ విధించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

జీవిత కథ ఆధారంగా

జీవిత కథ ఆధారంగా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. మొగల్స్ కాలంలో ఉన్న ఒక బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు చెందిన పండుగల సాయన్న అనే ఒక దోపిడీ దొంగ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు అని చెబుతున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.

రీ షూట్ చేస్తున్నారని

రీ షూట్ చేస్తున్నారని

కరోనా పరిస్థితులు కొంత కుదుట పడ్డ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది కానీ అనుకున్న రీతిలో అయితే జరగడం లేదని తెలుస్తోంది. నిర్మాతకు ఉన్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది అనే ప్రచారం జరిగింది. అయితే అది కాదని సినిమా షూటింగ్ జరిగిన తర్వాత రష్ చూసుకుని బాగా రాలేదు అని అనుకుని మళ్లీ రీ షూట్ చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది.

మరో సినిమా కూడా

మరో సినిమా కూడా

కాదు కాదు పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల్లో బిజీ అవడం వల్ల షూటింగ్ వేగంగా జరగడం లేదని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాలన్నీ ప్రచారమే కానీ ఇప్పుడు తాజాగా మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. అది ఏమిటి అంటే ఎలా అయినా ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివరి లోపు పూర్తి చేయాలని ఆ తర్వాత తాను మరో సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాతకు డెడ్ లైన్ విధించారు అని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ ప్రకటించిన సినిమాలు కాకుండా మరో సినిమా కూడా సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతోంది.

షరతులు

షరతులు

ఆ సినిమాలో కేవలం 4, 5 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే సరిపోతుందని పవన్ కళ్యాణ్ ని ఒప్పించారట. ఈ నేపథ్యంలో తాను మళ్లీ ఎన్నికలకు వెళ్లే లోపు ఉన్న సినిమాలు చాలా వరకు చేయాలని పవన్ కళ్యాణ్ వారికి షరతులు విధించారు అని తెలుస్తోంది. తాను రాజకీయ కార్యక్రమాలు లేకుండా ప్లాన్ చేసుకుంటా అని, అందుకే వీలైనంత త్వరలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయమని కూడా నిర్మాతలను పవన్ కోరినట్లు తెలుస్తోంది.

సంక్రాంతికి

సంక్రాంతికి

ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర భాషలకు చెందిన అనేక మంది నటీనటులు కూడా సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ విషయం మీద అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X