For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ డైరెక్టర్‌కు పవన్ కల్యాణ్ డెడ్ లైన్: ఈ సారి తేడా జరగకుండా పక్కా ప్లాన్

    |

    మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కెరీర్ ఆరంభంలోనే తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అతడు.. భారీ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో స్టార్‌డమ్‌ను కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం సినిమాలకు గ్యాపిచ్చిన పవన్.. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది అనుకున్న రీతిలో స్పందనను అందుకుని భారీ వసూళ్లను రాబట్టడంతో అతడిలో ఉత్సాహం రెట్టించింది.

    యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితమే 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే, అప్పుడు టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పూర్తి స్థాయిలో రాలేదు. అయినప్పటికీ ఈ ఫలితం పట్ల అటు పవన్.. ఇటు అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఉత్సాహంతోనే పవన్ కల్యాణ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే 'హరిహర వీరమల్లు' సినిమా షూట్‌లో కూడా పాల్గొన్నాడు. త్వరలోనే దీని కోసం పూర్తి స్థాయిలో డేట్స్ కేటాయించబోతున్నాడు.

    Pawan Kalyan Deadline to Krish for Harihara Veeramallu

    వాస్తవానికి రెండేళ్ల క్రితమే పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను మొదలు పెట్టాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ చిత్రంలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, దీన్ని మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురు కావడంతో పాటు పవన్ కల్యాణ్ విరామం తీసుకున్నాడు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను యూనిట్ ఇటీవలే ప్రారంభించింది. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు.

    డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్న పట్టుదలతో పవన్ కల్యాణ్ ఉన్నాడట. ఇదే విషయాన్ని దర్శకుడు క్రిష్‌కు కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నెల చివరికల్లా ఈ సినిమాను పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా పెట్టాడట. అందుకు అనుగుణంగానే క్రిష్ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత పవన్ రాజకీయాల కోసం సమయానికి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

    పిరియాడిక్ జోనర్‌లో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తైంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారనే ప్రచారం జరుగుతోంది.

    English summary
    Power Star Pawan Kalyan Now Doing Harihara Veeramallu under Krish direction. Pawan Kalyan Deadline To Krish for This Movie Rushes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X