పవన్ కళ్యాణ్ తో 14 రీల్స్ భారీ డీల్...ఎంతకి?

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబుతో వరసగా దూకుడు, 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలు చేస్తున్న నిర్మాతలు 14 రీల్స్ వారు త్వరలో పవన్ తో సినిమాలు చేయనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో అదే బ్యానర్ వారు మూడు చిత్రాలు డీల్ కుదుర్చుకోనున్నారని తెలుస్తోంది. రెమ్యునేషన్ గా మూడు సినిమాలకు కలిపి 82 కోట్లు ఆఫర్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అత్తారింటికి దారేది తో మార్కెట్ పరంగా ఓ రేంజికి వెళ్లిన పవన్ తో వారు వరసగా చిత్రాలు చేయాలని భావించి ఈ ఆఫర్ చేసారని చెప్తున్నారు. అయితే పవన్ ఓకే చేసాడో లేదా అనేది తెలయరాలేదు.

ఇక ఇదే బ్యానర్ లో మహేష్ బాబుతో మూడు చిత్రాలు డీల్ కుదుర్చుకుని ఏక మొత్తంగా 55 కోట్లు పే చేసారని వినికిడి. పవన్ తో చేయబోయే డీల్ ఓకే అయితే దర్శకులు,మిగతా సాంకేతిక నిపుణులు ఫైనల్ చేసి,డీల్ ఫైనల్ చేస్తారు. భారీగా చిత్రాలు చేస్తున్న ఈ బ్యానర్ నుంచి ఆఫర్ రావటంతో పవన్ సైతం ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇక 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. గత కొంతకాలంగా సరైన సినిమాల్లేని తమన్నాకి ఇది బంగారం లాంటి అవకాశమే అంటున్నారు. 2014 వేసవికి ఈ చిత్రం విడుదల అవుతుంది.

గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకునే పనిలో ఉన్నాడట శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X