పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: వెనక్కి తగ్గిన పవన్ కల్యాణ్.. ఇక ఇప్పట్లో రానట్లే.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించిన అతడు... తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. అదే సమయంలో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్‌లో టాప్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్.. ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడి గురించి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

ఏకంగా ముగ్గురిని లైన్‌లో పెట్టిన పవన్
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. కొన్నేళ్ల పాటు ప్రజాసేవ చేసిన అతడు.. మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకేసారి ఏకంగా ముగ్గురు దర్శకులను లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకరు వేణు శ్రీరామ్ కాగా.. క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్ తర్వాతి ఇద్దరు కావడం గమనార్హం.

హీరో.. పొలిటీషియన్.. లాయర్ అయ్యాడు
సుదీర్ఘ విరామం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వకీల్ సాబ్'తో పవన్ కల్యాణ్ మరోసారి ముఖానికి మేకప్ వేసుకోబోతున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో నివేదా థామస్ కీలక పాత్ర చేస్తోంది. ఇందులో పవన్ లాయర్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో హిట్ అయిన ‘పింక్'కు రీమేక్‌గా తెరకెక్కుతోందీ చిత్రం.

పవన్ క్రేజ్‌కు నిదర్శనం.. ఈ రికార్డులు
‘వకీల్ సాబ్' సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం ఫస్ట్ లుక్‌తో పాటు ‘మగువా మగువా' అనే పాట విడుదలైంది. ఈ రెండింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. దీంతో పవన్ కల్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపణ అయింది. ఈ రెండింటితో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

విడుదల వాయిదా.... ఫ్యాన్స్‌కు నిరాశ
రీఎంట్రీలో ఏకంగా మూడు సినిమాలు ఒప్పుకుని జోరు మీదున్నాడు పవన్ కల్యాణ్. ఒకదాని తర్వాత ఒకటి సినిమా చేసుకుంటూ వెళ్లాలని భావించిన అతడికి కరోనా రూపంలో భారీ షాక్ తగిలింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులు రద్దు అయిపోవడంతో మే 25న విడుదల కావాల్సిన ‘వకీల్ సాబ్'.. వాయిదా పడింది. దీంతో పవన్ ఫ్యాన్స్‌లో నిరాశ నెలకొంది.

‘వకీల్ సాబ్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ ఇదే
లాక్‌డౌన్ పిరియడ్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు షూటింగ్ వాయిదా పడిపోయింది. దీంతో ‘వకీల్ సాబ్' మిగిలిన భాగం చిత్రీకరణ ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో పవన్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందని ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుందట.
Recommended Video

వెనక్కి తగ్గిన పవన్.. ఇప్పట్లో రానట్లే.!
షూటింగులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ‘వకీల్ సాబ్' ఆగస్టు 15నే విడుదల అవుతుందని ఈ మధ్య ప్రచారం మొదలైంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కానుందట. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ చేయడం అంత మంచిది కాదని భావించిన పవన్ కల్యాణ్.. కొద్ది రోజుల తర్వాత మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











