తెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెర వెనుక...!?
నమ్మలేని నిజమిది..కాదనలేని వాస్తవమిది. పవన్ కళ్యాణ్ నిదానంగా సినిమాలు చేస్తాడనే కామెంటే తప్ప నిర్మాతల్ని ఇబ్బంది పెడతాడనే కంప్లైంట్ మాత్రం ఎప్పుడూ వినిపించలేదు. అయితే పవన్ పై ఇప్పుడా విమర్శని కూడా వినాల్సివస్తోంది ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ హీరోగా, నిఖిషా పటేల్ హీరోయిన్ గా ఎస్.జే. సూర్య దర్శకత్వంలో గత రెండేళ్ళుగా నాన్చుతూ రూపొందిద్దుకొంటున్న, 'కొమరం పులి" చిత్రానికి బ్యాలెన్స్ క్లియర్ చేస్తేనే డబ్బింగ్ చెబుతానని కండిషన్ పెట్టాడట పవర్ స్టార్.
రీసెంట్ గా ముంబై వెళ్ళి 'పులి" చివరి పాట చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా నిమిత్తం తనకు రావాల్సిన పారితోషికం మొత్తం అందితేనే డబ్బింగ్ చెప్పడానికి వస్తానంటూ ప్రొడ్యూసర్ కి సందేశం పంపాడట. దాంతో వీలైంత త్వరలో సినిమాని రిలీజ్ చేసుకోవాలని తాపత్రయపడుతున్న నిర్మాత శింగనమల రమేష్ ప్రస్తుతం పవన్ ఎమౌంట్ సెటిల్ చేసే పనిలో వున్నారని సమాచారం..!


Click it and Unblock the Notifications











