ఆ దర్శకుడితో పవన్ కళ్యాణ్‌ సినిమా.. దిల్ రాజు ప్లాన్.. అభిమానుల్లో మళ్ళీ అదే టెన్షన్?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో వకీల్ సాబ్ తో అర్ధమయ్యింది. బాలీవుడ్ రీమేక్ సినిమా అయినప్పటికీ దర్శకుడు వేణు శ్రీరామ్ సరికొత్త మేకింగ్ తో అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్, దిల్ రాజుతో సినిమా చేయడానికి మరో కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఒక దర్శకుడు ఫిక్స్ అయినట్లు టాక్ రాగా అభిమానుల్లో కొంత టెన్షన్ మొదలైనట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తుంటే అర్ధమవుతొంది.

దిల్ రాజు డేరింగ్ స్టెప్

దిల్ రాజు డేరింగ్ స్టెప్

పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో పింక్ సినిమా చేయడం చాలా రిస్క్ అని దిల్ రాజుకి చాలా మంది చెప్పారు. అయినప్పటికీ ఆయన పట్టు వదలకుండా పవన్ తోనే సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఇక పెద్దగా ఫామ్ లో లేనటువంటి వేణు శ్రీరామ్ ను దర్శకుడిగా ఎంచుకోవడం కూడా దిల్ రాజు డేరింగ్ స్టెప్ అని చెప్పవచ్చు.

మరొక హిట్టు కొట్టాలని

మరొక హిట్టు కొట్టాలని

దిల్ రాజు విజన్ కు ఫిదా అయిన పవన్ కళ్యాణ్ మరొక సినిమా చేయడానికి ఒక కమిట్మెంట్ కూడా ఇచ్చాడు. దీంతో దిల్ రాజు ఈసారీ పింక్ సినిమాకు మించి మరొక హిట్టు కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. వీలైనంత వరకు మంచి సందేశాత్మక కథనే తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

వంశీ పైడిపల్లితో..?

వంశీ పైడిపల్లితో..?

అయితే ఇటీవల ఒక దర్శకుడితో పవన్ సినిమా చేసే విషయంపై చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. వంశీ పైడిపల్లి. మహర్షి సినిమా అనంతరం ఈ దర్శకుడికి సరైన అవకాశాలు రావడం లేదు. బృందావనం, ఎవడు, ఊపిరి వంటి సినిమాలు చేసినప్పటికీ ఈ దర్శకుడు ఇంకా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా సినిమాలు చేయడం లేదనే టాక్ కూడా వస్తోంది.

మహేష్ సినిమా క్యాన్సిల్

మహేష్ సినిమా క్యాన్సిల్

అసలైతే సరిలేరు నీకెవ్వరు అనంతరం మహేష్ తో ఒక సినిమా చేయాలి. కానీ మహర్షి అంతగా మెప్పించకపోవడంతో మహేష్ డ్రాప్ అయ్యాడు. ఇక ఆ దర్శకుడు దిల్ రాజుకి సన్నిహితుడు కావడం వలన మరొక ఆఫర్ దొరికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే విషయంపై దిల్ రాజు మాట్లాడినట్లు సమాచారం.

అభిమానుల్లో టెన్షన్..?

అభిమానుల్లో టెన్షన్..?

ఇంకా ఫిక్స్ అయితే కాలేదు గాని చర్చలు జరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే మాత్రం అభిమానుల్లో కొంత టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు వకీల్ సాబ్ విషయంలో కూడా ముందు ఇదే తరహా వాతావరణం కనిపించింది. కానీ ఇచ్చిన అవకాశాన్ని వేణు శ్రీరామ్ కరెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. మరి వంశీ పైడిపల్లి దిల్ రాజును ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X