దర్శకుడుగా పవన్ కళ్యాణ్...పూర్తి డిటేల్స్
హైదరాబాద్ : అప్పట్లో జానీ చిత్రం డైరక్ట్ చేసిన పవన్ కళ్యాణ్... ఫలితం నిరాశపరచటంతో తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. అయితే మళ్లీ త్వరలో ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రానుందని సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జనగనమన అనే టైటిల్ ని పెట్టినట్లు చెప్తున్నారు. పవన్ స్వయంగా ఈ చిత్రానికి స్క్రిప్టు చేసుకుంటున్నారని, దేశభక్తి కి చెందిన కథతో,కమర్షియల్ ఎలిమెంట్స్ తో చిత్రం ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
మరోప్రక్క వెంకటేశ్ తో కలిసి పవన్‌కల్యాణ్ నటించబోతున్నారు. ఆస్ట్రేలియన్ హిట్ ఫిల్మ్ 'ద మ్యాన్ హూ స్యూడ్ గాడ్', హిందీ హిట్ ఫిల్మ్ 'ఓ మై గాడ్' సినిమాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ కాంబినేషన్ సినిమాని సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై డి. సురేశ్‌బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 'ఓ మై గాడ్'లో అక్షయ్‌కుమార్, పరేశ్ రావల్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
ఇదివరలోనే వెంకటేశ్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్ సినిమా కోసం గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఆ ఇద్దరూ కలిసి నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో అది వీలుపడలేదు. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంతో పాటు ఇతర అంశాలను త్వరలోనే వెల్లడిస్తామని సురేశ్‌బాబు చెప్పారు.
వెంకటేశ్, పవన్‌కల్యాణ్, సురేశ్ ప్రొడక్షన్స్ కలయికతో ఒక ప్రతిష్ఠాత్మక సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని శరత్ మరార్ తెలిపారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేశ్‌తో కలిసి నటించిన వెంకటేశ్ ఇప్పుడు పవన్‌కల్యాణ్‌తో జట్టు కడుతూ తెలుగులో మల్టీస్టారర్ ధోరణిని కొనసాగిస్తున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications












