పవన్ కళ్యాణ్ దర్శకుడితో మరోసారి సల్మాన్ ఖాన్ చర్చలు.. బిగ్గెస్ట్ ప్లాన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినిమాలకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు ఏ రేంజ్ లో లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మన దర్శకులతో పరభాషా హీరోలు కూడా వర్క్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు మన దర్శకులు బాలీవుడ్ హీరోలతో సినిమా చేయాలి అంటే అంత ఈజీగా ఒప్పుకునే వారు కాదు. కానీ ఎప్పుడు మాత్రం వారి ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. టాలెంట్ ఉన్న వారితోనే వర్క్ చేయడానికి భాషతో సంబంధం లేదని ఆలోచిస్తున్నారు. ఇక టాలీవుడ్ దర్శకులు వస్తే కథలు వినడానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ కూడా తెలుగు ఆడియెన్స్ కు దగ్గరవ్వాలని ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. 90ల కాలంలోనే కొన్ని హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ మళ్ళీ చాలా కాలం అనంతరం దబాంగ్ 3 సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి తెలుగు హీరోలు కూడా భారీగా క్రేజ్ అందుకుంటూ ఉండడంతో సల్మాన్ ఖాన్ కూడా టాలీవుడ్ లో డామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

Pawan kalyan director harish shankar biggest plan with salman khan

అందుకోసం తెలుగు దర్శకులతో కూడా సల్మాన్ ఖాన్ మంచి కథలు కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ దర్శకుడికి కూడా టచ్ లో ఉంటున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు. గబ్బర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ను కూడా ఆకర్షించిన హరీష్ శంకర్ అని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా చూసిన సల్మాన్ ఖాన్ అప్పట్లో ప్రత్యేకంగా హరీష్ శంకర్ ను అభినందించాడట. ఇక హిందీ నిర్మాతలతో కూడా హరీష్ శంకర్ కు మంచి పరిచయాలు ఉన్నాయి.

గతంలో అయితే ఒకసారి హరీష్ శంకర్ కు కథ కూడా చెప్పినట్లు టాక్ వచ్చింది. ఇక ఆ తరువాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో కలిసి హరీష్ సల్మాన్ ఖాన్ ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడాడు. అప్పుడే ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందని అనుకున్నారు. కానీ వాళ్ళ నుంచి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇటీవల మరోసారి సల్మాన్ ఖాన్ హరీష్ శంకర్ మధ్యలో చర్చలు జరిగినట్లు టాక్ వస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ కథతో సల్మాన్ ఖాన్ ను హరీష్ మెప్పించినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అసలైతే గత ఏడాదిలోనే పవన్ తో భవధీయుడు భగత్ సింగ్ అనే సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మిగతా కమిట్మెంట్స్ కారణంగా ఆ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అవుతోంది. ఇక ఇటీవల అయితే హరీష్ శంకర్ త్వరలోనే పవర్ స్టార్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. కానీ ఇంకా సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఈ లోపు హరీష్ సల్మాన్ ప్రాజెక్ట్ కోసం కథను రేడి చేసినట్లు సమాచారం. మరి ఆ ప్రాజెక్ట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X