ఫేవరేట్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా చేయట్లేదట.. ఎందుకంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కన ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఆ సినిమా తరువాత పవన్ వెంటనే రెండు సినిమాలతో రాబోతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇంకా కొన్ని కథలు చర్చల దశలో ఉన్నట్లు టాక్ వచ్చింది. అయితే పవన్ తనకు ఇష్టమైన దర్శకుడితో సినిమా చేయడం లేదట.

వకీల్ సాబ్ ఎప్పుడొస్తాడో..

వకీల్ సాబ్ ఎప్పుడొస్తాడో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సమ్మర్ ఎండింగ్ కి పరిస్థితులను బట్టి వకీల్ సాబ్ సినిమాతో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కరోనా వైరస్ తగ్గితే వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ లాక్ డౌన్ ఎంత కాలం కొనసాగుతుందో పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.

క్రిష్ హిస్టారికల్ ఫిల్మ్..

క్రిష్ హిస్టారికల్ ఫిల్మ్..

గౌతమి పుత్ర శాతకర్ణి వంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు క్రిష్ మళ్ళీ అదే తరహాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరొక హిస్టారికల్ ఫిల్మ్ ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా పూర్తి కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ సినిమా కోసం పవన్ ఒక స్పెషల్ లుక్ కూడా సెట్ చేసుకున్నాడు.

హరీష్ శంకర్ తరువాత..?

హరీష్ శంకర్ తరువాత..?

గబ్బర్ సింగ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ మరొసారి ఆయనతో కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో మంచి కమర్షియల్ సినిమా చేసి అందులోనే ఒక సోషల్ మెస్సేజ్ ఇవ్వనున్నాడట. ఆ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఆ తరువాత పవన్ ఎవరితో వర్క్ చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

Recommended Video

#Tollywood : This Famous Director Lost A Chance To Direct The Pawan Kalyan Movie | Filmibeat Telugu
ఆ దర్శకుడితో సినిమా లేనట్లే..

ఆ దర్శకుడితో సినిమా లేనట్లే..

పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన దర్శకుల్లో కిషోర్ కుమార్ పార్ధసాని ఒకరు. గోపాల గోపాల సినిమాతో పవన్ కి బాగా దగ్గరైన కిషోర్ ఆ తరువాత కాటమరాయుడు తీసాడు. నెక్స్ట్ ఈ హీరోతోనే మరొక సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే కిషోర్ ఇంతవరకు పవన్ కళ్యాణ్ ని కలవలేదట. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో మరొక హీరోతో సినిమా చేసేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X