పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ.. లైగర్ డిజాస్టర్ టైమ్ లో మాస్ ఆఫర్!
లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ గతంలో ఇప్పుడు లేనివిధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ ను చూడాల్సి వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసింది. విజయ్ హార్డ్ చేసినప్పటికీ కూడా కంటెంట్ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా విడుదలైన మొదటి వారంలోనే కలెక్షన్స్ ఒక్కసారి డౌన్ అయిపోయాయి. ఇక విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలతో మళ్ళీ ఎలాగైనా మంచి విజయాలను అందుకుని ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు.
ఇక ప్రస్తుతం శివ నిర్వణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఆ సినిమా ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఆ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ను సుకుమార్ పుష్ప 2 సినిమా తర్వాత సెక్స్ పైకి రానుంది. అయితే ఈ క్రమంలో విజయ్ మరికొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చర్చలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక రీసెంట్గా విజయ్ దేవరకొండ మరో మాస్ దర్శకుడితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరు కాదు పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తో అగ్రదర్శకుడుగా మారిపోయిన హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తోనే మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ తో కూడా హరీష్ శంకర్ ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది.
అసలైతే గీత గోవిందం సినిమా తర్వాత హరిష్ శంకర్ విజయ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడు విజయ్ బిజీగా ఉండడంతో సెట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యం అవుతుండడం వలన హరీష్ శంకర్ మళ్లీ ఇటువైపుగా యూ టర్న్ తీసుకున్నాడు అనే టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











