Harihara Veeramallu: ఎన్టీఆర్ మూవీల హరిహర వీరమల్లు.. పవన్ అసంతృప్తి.. ఆగిపోయిన సినిమా!
సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. అప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా ఫుల్ స్పీడుతో దూసుకెళ్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ఈ జోష్‌తోనే మరిన్ని ప్రాజెక్టులను సైతం ప్రకటించాడు. అందులో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే 'హరిహర వీరమల్లు' ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ.. పిరియాడిక్ నేపథ్యంతో రూపొందుతోంది. దీంతో దీనిపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అనేవి మీరే చూడండి మరి!

అలా వెళ్లి.. ఇలా వచ్చిన పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే దాదాపు మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత 'వకీల్ సాబ్' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత అంటే ఇటీవలే 'భీమ్లా నాయక్' అనే మరో సినిమాను కూడా ప్రేక్షకులకు అందించాడు. ఈ రెండు మూవీలకు కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడిన విషయం తెలిసిందే.

తొలిసారి పిరియాడిక్ మూవీలో
పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ సినిమా పిరియాడిక్ జోనర్‌లో వస్తోంది. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. నోరా ఫతేహీ, నిధి అగర్వాల్ కీలక పాత్రలు చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తన సుదీర్ఘమైన కెరీర్‌లోనే తొలిసారి పవన్ ఇలాంటి చిత్రంలో నటిస్తున్నాడు.

అంచనాలు.. ఆఫర్లు భారీగానే
'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించిన టైటిల్ వీడియోను ఆ మధ్య విడుదల చేశారు. దీనికి పవన్ అభిమానుల నుంచే కాక, సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఊహించని రీతిలో స్పందన రావడంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఫలితంగా దీనికి భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలన్నీ క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

వరుస బ్రేక్స్.. మళ్లీ మొదలెట్టి
మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, దీన్ని మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురు కావడంతో పాటు పవన్ కల్యాణ్ బ్రేక్ తీసుకున్నాడు. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను యూనిట్ ఇటీవలే ప్రారంభించింది. దీనికోసం భారీ ఖర్చుతో పాత కాలం నాటి కట్టడాల సెట్టింగ్‌లు నిర్మించారు.

సినిమాను చూసిన పవర్ స్టార్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇందులో పవన్ దాదాపు 30 రకాల డ్రెస్‌లతో విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ హీరో ఈ సినిమా చిత్రీకరణ అయిన భాగాన్ని చూశాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

రషెస్‌పై పవన్ అసంతృప్తిగా
'హరిహర వీరమల్లు' మూవీ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. పవన్ కల్యాణ్ తాజాగా ఈ సినిమా రషెస్ చూసి చాలా అసంతృప్తికి లోనయ్యాడట. దీనికి కారణం ఇందులో అతడి గెటప్‌లు 'శక్తి' సినిమాలో ఎన్టీఆర్ లుక్ మాదిరిగా కనిపించడమేనని తెలుస్తోంది. అప్పట్లో దానికి ఎంతలా ట్రోల్స్ వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే.

ఆగిపోయిన సినిమా షూటింగ్
'హరిహర వీరమల్లు' మూవీ రషెస్ చూసిన తర్వాత పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉండడంతో పాటు ఈ సినిమా షూటింగ్‌కు వెంటనే బ్రేక్ ఇచ్చేశాడని కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో ఇప్పుడు జరుగుతోన్న, త్వరలో జరగాల్సిన షెడ్యూళ్లు ఆగిపోయాయని అంటున్నారు. దీంతో ఇప్పుడీ వార్త ఇండస్ట్రీ వర్గాల్లోనే హాట్ టాపిక్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











