ఏడేళ్ల క్రితం ఆగిపోయిన పవన్ సినిమా మళ్ళీ తెరపైకి.. త్రివిక్రమ్ కోబలి ప్లాన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం, గురువారం రెండు రోజులు కూడా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా కనిపించారు. ఈ సారి పుట్టినరోజుకు ఆయనకి అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా బెస్ట్ విషెస్ అందించారు. అందుకే పవన్ కుడా ఏ మాత్రం లైట్ తీసుకోకుండా ప్రతీ ఒక్కరికీ రిప్లై ఇస్తున్నాడు. ఇక సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులకు ఏ స్థాయిలో కిక్కిచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ముందుగానే కొంత పూర్తి చేశారు

ముందుగానే కొంత పూర్తి చేశారు

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే వకీల్ సాబ్ ఎండింగ్ దశలో ఉంది. ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పిరియాడిక్ సినిమా షూటింగ్ కూడా ఆల్ రెడీ కొంత పూర్తి చేశారు. ఆ సినిమా ఇప్పట్లో మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాత స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

పవన్ 30వ ప్రాజెక్టు కోసం

పవన్ 30వ ప్రాజెక్టు కోసం

ఇక గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి మరో సినిమా చేయనున్న పవర్ స్టార్ మొదటిసారి యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఇక పవన్ 30వ ప్రాజెక్టు కోసం కూడా ఆలోచిస్తున్నట్ల తెలుస్తోంది. అందుకోసం త్రివిక్రమ్ ని సంప్రదించినట్లు సమాచారం.

ఏడేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా..

ఏడేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా..

ఇక ఏడేళ్ల క్రితం ఆగిపోయిన ఒక సినిమాని మళ్ళీ సెట్స్ పైకి తీసుకురావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. కోబలి అనే డిఫరెంట్ మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమా కథను త్రివిక్రమ్ పవన్ కోసం రాసుకున్నాడట. ఆ సినిమా పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అప్పట్లో టాక్ అయితే గట్టిగా వచ్చింది. కానీ ఎందుకో ఆ సినిమా సడన్ గా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
స్ట్రాంగ్ హిట్ కొట్టాలని

స్ట్రాంగ్ హిట్ కొట్టాలని

ఇక ఫైనల్ గా ఇన్నేళ్ల అనంతరం పవన్ ఆలోచనతో ఆ సినిమా కథపై త్రివిక్రమ్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. చివరగా వీరి కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి దారుణమైన రిజల్ట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అలా కాకుండా కొడితే స్ట్రాంగ్ హిట్ కొట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే మరొక ఏడాదైనా వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X