ఆ భారీ సినిమాపై పవన్ కల్యాణ్ ఫోకస్? ముందుగా వాటికే ప్రిఫరెన్స్?
ఇప్పుడు తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్ స్టార్ హీరోస్ లో దాదాపు అందరు హీరోలు కూడా సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకుని రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ పై గట్టిగా కన్నేశారు. అయితే పలువురు స్టార్ హీరోస్ అయితే తమకంటే తక్కువ మార్కెట్ ఉన్న కొందరు యువ స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టి సక్సెస్ అయిపోయారు కానీ ఆ బిగ్ స్టార్స్ మాత్రం ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా సినిమా లోకి దిగుతున్నారు.
కాగా ఈ స్టార్స్ లో అయితే తెలుగు పవర్ స్టార్ అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. కాగా పవన్ ఇప్పుడు మొత్తం మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచితే వాటిలో రెంటికి సీక్వెల్స్ అవి కాకుండా ఇంకో కొత్త సినిమా కూడా చేయాల్సి ఉంది. కాగా ఈ సినిమాలలో మూడు సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు సినిమాలు సెట్స్ మీద ఉండి పవన్ ఎపుడు ఓకే చెబితే అప్పుడు స్టార్ట్ చేయాలి అని రెడీగా ఉన్నారు.

అయితే ఈ సినిమాలో ఓ సినిమాకి మాత్రం పవన్ హ్యాండిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక సినిమాని మాత్రం పక్కన పెట్టి పవన్ రెండు సినిమాల షూటింగ్ ముందుగా మొదలు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి పవన్ పట్టించుకోని ఆ సినిమా ఏది అంటే తన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా "హరిహర వీరమల్లు" అట. ఇప్పుడు సినిమాకి కాదని పవన్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇక్క ఇంట్రెస్టింగ్ గా ఆ మూడు సినిమాల్లో వీరమల్లు ఒక్కటే ఈ ఏడాది రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయినా కూడా పవన్ ఈ సినిమాని ఇంకా హోల్డ్ లోనే ఉంచడం గమనార్హం. మిగతా రెండు సినిమాలు ఎలానో వచ్చే ఏడాదికే అని ఫిక్స్ అయ్యిపోయింది. అయినా కూడా ఆ సినిమాని పక్కన పెట్టడం ఆ సినిమా మేకర్స్ కి కూడా మరింత ఇబ్బందికరమే అని చెప్పాలి.
అయితే వీరమల్లు సినిమాకి పవన్ క్లీన్ షేవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఓజి, ఉస్తాద్ లకి మాత్రం కొంచెం గడ్డం అవసరం ఉంది. ఎలాగో ఇపుడు పవన్ గడ్డం లుక్ లోనే ఉన్నాడు కాబట్టి ఇలా ముందు ఈ సినిమాలు స్టార్ట్ చేయాలని ప్లాన్ కావచ్చు. కాగా ఇప్పుడు ఈ సినిమాలు మాత్రం ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పవన్ డేట్స్ ఎలా బాలన్స్ చేయాలని చూస్తున్నారట.
మరి ఇవన్నీ చూస్తుంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఈ ఏడాది రిలీజ్ అనే అనౌన్స్ చేసిన ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మాత్రం వచ్చే అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోతున్నాయి అనే చెప్పి తీరాలి. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











