For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ సినిమాపై సెన్సేషనల్ న్యూస్: తండ్రి ఒకలా.. కొడుకు మరోలా.. ఎప్పుడూ చూడని పాత్రలో!

  |

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. అంతలా ఈ మెగా హీరో దాదాపు రెండు దశాబ్ధాలుగా సినీ రంగంలో తన హవాను చూపిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. అద్భుతమైన యాక్టింగ్‌తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఇక, ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన అతడు.. వరుస సినిమాలతో జోష్ మీద కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే హరీశ్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

  అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన పవన్

  అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన పవన్

  దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, టికెట్ రేట్ల తగ్గింపుతో పాటు కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా నష్టాలనే ఎదుర్కోవాలని వచ్చింది.

  మరో రెండు కూడా మొదలెట్టేశాడు

  మరో రెండు కూడా మొదలెట్టేశాడు

  ప్రస్తుతం పవన్ కల్యాణ్ క్రిష్ జాగర్లమూడితో కలిసి ‘హరిహర వీరమల్లు' అనే పిరియాడిక్ మూవీని కూడా చేస్తున్నాడు. మెగాసూర్య బ్యానర్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌లో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర రూపొందిస్తోన్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు.

  గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో ఇంకో మూవీ

  గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో ఇంకో మూవీ


  రీఎంట్రీ ఇస్తున్న సమయంలోనే పవన్ కల్యాణ్ ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో తనకు గతంలో ‘గబ్బర్ సింగ్' వంటి భారీ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్‌తోనూ ఓ సినిమా ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ చిత్రం రాబోతుండడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇది ట్రెండ్ అవుతోంది.

  సినిమా కథపై పలు రకాల పుకార్లు

  సినిమా కథపై పలు రకాల పుకార్లు

  హరీశ్ శంకర్‌తో పవన్ కల్యాణ్ నటించబోయే మూవీ విషయంలో ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్ర కథ విషయంలో కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. ఇది ఠాగూర్ తరహా సినిమా అని.. ఇందులో పవన్ ప్రొఫెసర్‌గా నటిస్తున్నాడని కొందరు అన్నారు. అలాగే, పోలీస్ ఆఫీసర్ కథ అని, పాలిటిక్స్ నేపథ్యంతో కూడిందని మరికొందరు చెప్పారు.

  పవన్ - హరీశ్ సినిమా కథ ఇదేనట

  పవన్ - హరీశ్ సినిమా కథ ఇదేనట

  పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ సినిమా కథ గురించి ఇటీవల ఓ న్యూస్ వైరల్ అయింది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కబోతుందట. తన తండ్రి మరణానికి కారణం అయిన వాళ్లపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్న కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు ఓ వార్త ప్రచారం అవుతోంది. పాత స్టోరీనే అయినా.. దీన్ని సందేశాత్మకంగా రూపొందిస్తున్నారని తెలిసింది.

  తండ్రి గొప్పగా.. కొడుకు పాత్ర మాస్‌గా

  తండ్రి గొప్పగా.. కొడుకు పాత్ర మాస్‌గా

  ఇదే సినిమాలో పవన్ కల్యాణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఎంతో నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్‌‌గా తండ్రి పాత్ర ఉంటే.. పూర్తి మాస్ బ్యాగ్‌డ్రాప్‌తో కొడుకు రోల్ ఉంటుందని తెలిసింది. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లోని ఏ హీరోకూ కుదరని క్యారెక్టరైజేషన్ ఇందులో పవన్ కోసం డిజైన్ చేశాడట దర్శకుడు హరీశ్ శంకర్.

  English summary
  Pawan Kalyan to do a Movie with Stylish director Harish Shankar. In This Movie Power Star Paly Dual Roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X