పవన్‌ వల్లే నష్టం వచ్చిందని ఏడుపు

By Srikanya

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేని బలపరుస్తూ ప్రచారం చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు, స్టార్ హీరో పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు సిని వర్గాల్లోనే కాక రాజకీయ వర్గాల్లో సైతం హాట్ టాపిక్ గా మారారు. ఆయన వల్ల ఏ మేరకు ఓట్లు తెలుగుదేశానికి వచ్చాయో, వైయస్సార్పీ కోల్పోయి ఉండవచ్చో అని లెక్కలు వేస్తున్నారు. ఆయన ఎన్నికల్లోనూ గబ్బర్ సింగ్ లా మాటల తూటాలతో ప్రత్యర్దులపై విరుచుకుపడి విజయం సాధించారు. పవనంలా మారి రెండు రాష్ట్రాల్లోనూ ప్రచారం చేసారు. ఇక వైయస్సార్పీ గెలుస్తుందని బెట్టింగులు కాసిన వారు లక్షల్లో ఓడిపోయారు. దాంతో వారు తమ నష్టానికి కారణం పవన్ ఒక కారణంగా చెప్తున్నారు.

బెట్టింగుల్లో ఓడిన వారు... పవన్‌కల్యాణ్‌ అభిమానులు, ఆయన సామాజిక వర్గం వారు ఆయనకు మద్దతు పలికి,ఆయన చెప్పిన పార్టీలకే ఓటేసి గెలిపించారనే కంక్లూజన్ కి వస్తున్నారు. అయితే లేటుగా ఆయన పవన్ ని అంచనా వేయటం వల్ల పెద్దగా ఫలితం లేదనేది నిజం. ఆయన సొంత పార్టీని సైతం ఓట్లు చీలిపోతాయని మరీ ప్రక్కన పెట్టి మరో పార్టికి ప్రచారం చేయటం అందరినీ ఆకర్షించింది. మొదటి నుంచీ వైయస్సార్పీ విజయం సాధిస్తుందని ప్రచారం జరగటంతో బెట్టింగులు కొన్ని ఏరియాల్లో దాన్ని నమ్మి కాసి, లక్షల్లో నష్టపోయారు.

Pawan Kalyan emerged a huge force in politics

ఇక పవన్‌కల్యాణ్‌ కు నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు. ''పవన్‌కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గొప్ప సహకారాన్ని అందించారు. ఆయనకు నా కృతజ్ఞతలు'' అని ట్వీట్‌ చేశారు మోడీ. అందుకు పవన్‌కల్యాణ్‌ కూడా స్పందించారు. నరేంద్రమోడీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

''మోడీ నా పేరును ప్రస్తావించడం సంతోషాన్నిచ్చింది. కేవలం నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. మోడీ నాయకత్వం అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, యువతరానికి మార్గనిర్దేశకులుగా నిలుస్తారన్న విశ్వాసం నాకు ఉంది. గొప్ప బాధ్యతను భుజాన వేసుకొన్న ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకొంటున్నా'' అని ఆ ప్రకటనలో ఆయన వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X