పవన్..పరిటాల రవి ఎపిసోడ్ రక్త చరిత్రలో...?
పవన్ కళ్యాణ్, పరిటాల రవి మధ్య జరిగిన ఇష్యూ, ఆ తర్వాత అది ఓ పాపులర్ దినపత్రికలో వస్తే గొడవ కావటం తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తాజాగా పరిటాల రవి జీవిత చరిత్రను రక్త చరిత్ర పేరుతో తెరకెక్కిస్తున్న నేపధ్యంలో మర్ఛిపోయిన ఈ సంఘటన మళ్ళీ తెరపైకి వచ్చింది. ఫిల్మ్ వర్గాల్లో కాక బయిట కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సంఘటనను రక్త చరిత్రలో వర్మ చూపెడతాడా అని చర్చిస్తున్నారు. అంత సాహసానికి వర్మ ఒడి కట్టడని, కేవలం ఫ్యాక్షన్ రాజకీయాలు,హత్య జరిగిన తీరుపైనే కేంద్రీకరిస్తారని ఓ వర్గం అంటోంది. అయితే వర్మ సెన్సేషన్ కోసం ఏదైనా చేస్తాడని ఈ సంఘటన గ్యారెంటీగా స్క్రిప్టులో ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఏది నిజమో తెలియాలంటే రక్త చరిత్ర బయిటపడేదాకా వెయిట్ చేయాల్సిందే.
పవన్ కళ్యాణ్ పరిటాల రవి పులి రక్త చరిత్ర వర్మ అడవి వివేక్ ఒబరాయ్ సూర్య అనంతపురం pawan kalyan raktha charithra ram gopal varma paritala ravi


Click it and Unblock the Notifications