ఒకసారి దెబ్బతిన్నాడు, అయినా మరోసారి పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన డ్రీమ్ నెరవేర్చుకోవడానికి మరోసారి రిస్క్ చేయడానికి సిద్ధం అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఆయన సన్నిహితుల వర్గాల నుంచి. పవర్ స్టార్ మరోసారి దర్శకత్వం వైపు దృష్టి పెట్టబోతున్నాడట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన 'జానీ' చిత్రం పెద్ద ప్లాపవ్వడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవర్ స్టార్ కెరీర్లో చాలా ప్లాపుల వచ్చి పడ్డాయి. తాజాగా మళ్లీ కెరీర్ గాడిలో పడటంతో పవర్ స్టార్ తన డ్రీమ్ అయిన దర్శకత్వం వైపు దృష్టి మళ్లించాడట.
జానీ సినిమాలో తాను చేసిన తప్పిదాలను, ఈ సినిమాలో అనుసరించాల్సిన వ్యూహాలను, ఎలాంటి సినిమా అయితే ప్రేక్షకులు మెచ్చుతారు అనే విషయాలపై పవర్ స్టార్ ఓ అవగాహనకు వచ్చారని, ఇప్పటికే ఆయన కథ, స్క్రిప్టు రెడీ చేసుకున్నాడని, నిర్మాత కూడా ఫిక్స్ అయ్యాడని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని టాక్.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా వివరాల్లోకి వెళితే... ఈ చిత్రంలో పవన్ సరసన సమంత దాదాపుగా ఖరారైంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











