twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ పై ప్రేమతో ఎఆర్ రెహమాన్ పై అయిష్టం...

    By Sindhu
    |

    పవర్ స్టార్ చిత్రం పాటలు ఈ నెల 11న మార్కెట్ లోనికి వస్తున్నాయని తెలియగానే పవన్ అభిమానుల ఆనందానికి అవధులే లేవు అయితే వారికి ఇప్పుడు మరో దిగులు పట్టుకుంది. ఏమి లేదు..ఆ దిగులంతా సంగీత దర్శకుడు రెహామాన్ పైనే ఇప్పటికే నెట్ లో రెండు 'పులి"పాటలు వచ్చేశాయ్..అవి రెండు కూడా అట్టర్ ప్లాప్ గా ఉన్నాయని అభిమానులు నిరాశచెందుతున్నారు. మరీ ఆ రెండు పాటలు నిజంగా 'పులి" చిత్రంలోనివే..అయితే మాత్రం పవన్ చిత్రంపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉందని పవన్ అభిమానులు భయపడుతున్నారు..ఒకవైపు నందమూరి నటసింహాం 'సింహా"తో మంచి హిట్ ఇచ్చి తన అభిమానులను సంతోష పెట్టాడు.

    మరి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నందమూరి అభిమానుల కంటే ఎక్కువగా సంతోషపడేలా చేస్తాడని గర్వంగా చెప్పుకుంటున్నారు..కానీ రెహామాన్ ఈ చిత్రానికి పెద్ద సమస్యగా మారాడని తెలియడంతో ఆయనకు ఎన్నిఅవార్డులు వచ్చినా ఎంతగా పేరు ఉన్నా రెహామాన్ అంటే అయిష్టం వ్యక్తం చేస్తున్నారు..అభిమానులు మరి మంచి ఆడియో ఇచ్చి పవన్ అభిమానులను రెహామాన్ సంతోష పెడతాడని ఆశిద్దాం..అన్నట్లు ఆ చిత్రం వచ్చే నెల 12న విడుదల చేయడానకి నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X