పవన్ ఫ్యాన్స్ ఆ డైరక్టర్ నే తిడుతున్నారు
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు దర్శకుడు ఎస్.జె.సూర్య పేరు వింటే మండిపడుతున్నారు. గతంలో తమ హీరో పవన్ కి ఖుషీ వంటి హిట్ ఇచ్చాడని గర్వంగా చెప్పుకున్న ఆ ఫ్యాన్సే ఇప్పుడు మండిపడటానికి కారణం ఉంది. అదే పులి వంటి ప్లాప్ ఇప్వటమే కాక,పంజా ప్లాపు కు కూడా అతనే కారణమని..అదెలా అంటే...పంజా దర్శకుడు విష్ణు వర్ధన్ ని పవన్ కి పరిచయం చేసింది ఎస్.జె.సూర్యనే. ఈ విషయాన్ని విష్ణు వర్ధన్ కూడా రీసెంట్ గా...'పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తానని... ఆ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో ఎస్.జె.సూర్యకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన వల్లే అవకాశం దక్కింది''అని కన్ఫర్మ్ చేసి చెప్పారు.
తమిళంలో భిల్లా వంటి సూపర్ హిట్ ఇచ్చిన ఆయన తెలుగులో పవన్ తో పంజా చిత్రం చేసారు. అయితే ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే వీకెండ్ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజిలో అదరకొట్టింది. అది పవన్ కున్న స్టామినేనే కానీ సినిమా సత్తా కాదని తేల్చారు. దాంతో వరస ఫ్లాపులనుంచి కోలుకుని ఓ హిట్ ఇస్తాడనుకున్న పవన్ ఇలా ఫ్లాపుతో మరో సారి పలకరించటం ఫ్యాన్స్ కు ఏం చేయాలో అర్దం కాని స్ధితి తెచ్చింది. అయితే సినిమా ఎలా ఉన్నా పవన్ స్టైల్స్, నటన మాత్రం ఎప్పటిలాగే అలరించింది అనే వారు చెప్తున్నారు. ఇక ఈ పంజా ప్లాఫ్ కు పరోక్షంగా ఎస్.జె.సూర్యనే కారణం అంటున్నారు.


Click it and Unblock the Notifications











