twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్ కి తప్పని తిప్పలు.. టీవీలో వచ్చినా వదల్లేదు, ఏమవుతుందో?

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు వకీల్ సాబ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమా రావడంతో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని నిన్న జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్ చేశారు. అయితే ఈ విషయంలో కాస్త రచ్చ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
    వకీల్ సాబ్ మాస్

    వకీల్ సాబ్ మాస్

    అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ అందుకున్న పవన్ ఇక ఆ తర్వాత సినిమాలు చేయను ఇక తన జీవితం రాజకీయాలకే పరిమితం అంటూ ప్రకటన చేశారు.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు ఎదురు కావడంతో పవన్ మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రొటీన్ సినిమాల కంటే సోషల్ మెసేజ్ ఉన్న సినిమా చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ చేశారు.

    సూపర్ క్రేజ్

    సూపర్ క్రేజ్

    సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడంతో మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ దెబ్బతో భారీ కలెక్షన్స్ కూడా సాధించింది. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ ఎంత సాధించింది అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా కంటెంట్ జనానికి బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ మాస్ యాంగిల్ లో చూపిస్తూనే మరోపక్క క్లాస్ స్కిల్స్ చూపిస్తూ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

     వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

    వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

    ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు దక్కించుకుంది. నిన్న(ఆదివారం) ఈ సినిమా ప్రసారం కావడంతో రేటింగ్స్ లో దుమ్ము రేపాలని, ఎలా అయినా ఈ సినిమా టీఆర్పీ రికార్డులు బద్దలు కొట్టాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. వకీల్ సాబ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను మంచి హిట్ చేయాలని జీ తెలుగు విస్తృతంగా ప్రచారం చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా హంగామా చేశారు.

    పాత గాయాన్ని రేపుతూ

    పాత గాయాన్ని రేపుతూ

    అయితే ఏపీలో వకీల్ సాబ్ రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు తగ్గించి 2012 యొక్క పాత GOను మళ్ళీ తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందనే విషయాన్ని నిన్న వారు గుర్తు చేసుకున్నారు. సినిమాల విషయంలో రాజకీయాలు తెచ్చినందుకు వారు మరోసారి తమ కోపాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, పవన్‌కళ్యాణ్‌, జనసేనపై ప్రతీకారంగా కొన్ని ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు కేబుల్‌ నెట్‌వర్క్‌లోని జీ తెలుగు ఛానెల్‌ను అడ్డుకున్నారని కొందరు అభిమానులు ఆరోపించారు.

     ఛానల్ బ్లాకింగ్

    ఛానల్ బ్లాకింగ్

    పాత జ్ఞాపకాలు మరువక ముందే ఈ ఛానల్ బ్లాకింగ్ వ్యవహారాన్ని మళ్ళీ రచ్చ రేపిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు. పవన్ సినిమా టీఆర్పీ రికార్డులు బద్దలు కొడుతుందనే భయంతోనే ఇలా పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తదుపరి సంవత్సరం సంక్రాంతికి అయ్యప్పనుం కోషియుం రీమేక్ సినిమా విడుదల చేసినప్పటికీ ఏదైనా మారుతుందేమో చూడాలి.

    English summary
    Powerstar Pawan Kalyan’s Vakeel Saab World Television Premiere has happened on Zee Telugu last night. Some fans have alleged that YSR Congress leaders in a few areas have blocked Zee Telugu channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X