పవన్ కల్యాణ్‌ని లైట్ తీసుకున్న త్రివిక్రమ్.. మరీ ఇలా తీసిపారేస్తే ఎలా సార్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనే కాకుండా సినిమాలతో కూడా బిజీ అవుతున్నాడు. అయితే సినిమాలు ఎన్ని చేస్తున్నా కూడా పవన్ తన దృష్టిని మొత్తం రాజకీయాలపైనే ఉంచినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా కుదురుకోవడానికి సినిమాల వైపు మళ్ళిన పవర్ స్టార్ వీలైనంత త్వరగా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్..
ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయంలో త్రివిక్రమ్ వ్యవహరిస్తున్న తీరు అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు. మరీ ఇంత లైట్ తీసుకుంటే ఎలా అంటూ సోషల్ మీడియా ద్వారా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పవన్ త్రివిక్రమ్ ఇండస్ట్రీలో చాలా మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ పై సినిమా రావాలని చాలా రోజులుగా కోరుకుంటున్నారు.

ఆ డిజాస్టర్ దెబ్బ..
పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ సినిమా చేయడం చేయకపోవడం అనేది వారి వ్యక్తిగత అభిప్రాయం అయ్యి ఉండవచ్చు. కానీ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను త్రివిక్రమ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పవన్ కూడా కొంత వరకు నిరాశ చెందారు. పైగా ఆ సినిమా కాపీ అని తెలడంతో విమర్శలు చేసే వారికి బలం వచ్చినట్లయ్యింది.

ఏ కోణంలో కూడా..
అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. కనీసం ఆ సినిమా యవరేజ్ హిట్ కూడా కాకపోవడం గమనార్హం. త్రివిక్రమ్ కెరీర్ లో ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ అజ్ఞాతవాసిని ఏ కోణంలో కూడా మెప్పించలేదు. అలాంటి డిజాస్టర్ ఇచ్చినప్పుడు పవన్ కోసం మరో సినిమా చేయాల్సిన బాధ్యత ఉండదా?

త్రివిక్రమ్ కనిపిస్తే చాలు..
పవన్ అభిమానులు త్రివిక్రమ్ కనిపిస్తే చాలు.. మా అన్నతో సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. అల..వైకుంఠపురములో హిట్ తరువాత త్రివిక్రమ్ మూడు స్క్రిప్ట్ లను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు హీరోలు కూడా సెట్టయినట్లు సమాచారం.
Recommended Video

కనీసం భవిష్యత్తులో అయినా..
అసలైతే ఆజ్ఞతవాసి కొట్టిన దెబ్బకు త్రివిక్రమ్ డైరెక్ట్ గా మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ కనీసం ఆయన భవిష్యత్తులో అయినా ఒక సినిమా ఉంటుందని బలమైన క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అభిమానుల్లో త్రివిక్రమ్ తీరుపై కాస్త అసహనంగానే ఉన్నారు.


Click it and Unblock the Notifications











