»   »  రేణు దేశాయ్ ని ఇబ్బంది పెడుతున్న పవన్ ఫ్యాన్స్

రేణు దేశాయ్ ని ఇబ్బంది పెడుతున్న పవన్ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, రేణు దేశై ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రేణు తన పిల్లలతో కలిసి పూనేలో ఉంటున్నారు. అక్కడ ఆమె మరాఠి చిత్రాలు నిర్మాణంలో బిజీ అయ్యారు. ఇక్కడ పవన్ సొంతంగా జనసేన పార్టీని స్ధాపించారు. ఈ నేపధ్యంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పవన్ ఫ్యాన్స్ వారి పర్శనల్ ఇష్యూల గురించి పోస్ట్ లు పెడుతూ,ఆమెను ట్యాగ్ చేస్తూ,ఆమెకు పర్శనల్ మెసేజ్ లు పెట్టడం జరుగుతోందని తెలుస్తోంది. దాంతో ఆమె పర్శనల్ మెసేజ్ లు పంపే ఆప్షన్ ని స్విఛ్ఛాప్ చేసింది. అలాగే ఈ విషయంపై మాట్లాడింది.

రేణు దేశాయ్ స్పందిస్తూ... "నేను నా ఇన్ భాక్స్ లో వచ్చే స్టుపిడ్ పర్శనల్ మెసేజ్ లకు చాలా విసుగుచెందాను. ఈ రోజు నుంచి నేను నా మెసేజులు ఆప్షన్ స్విచ్చాఫ్ చేస్తున్నాను. ..నేను మీరంతా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనే విషయం అర్దం చేసుకోగలను, కాని సెలబ్రెటీలకు కూడా మనుష్యులే..వారికీ భావోద్వేగాలు ఉంటాయి..వారు హర్ట్ అవుతారు..గ్రో అప్ గైస్ !!!!".

pawan kalyan fans troubling renu desai

నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.  మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో దేశాయ్ జన్మించింది.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్. 'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

రేణు దేశాయ్ నిర్మాతగా మారి 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.

English summary
Renu Desai said, “I am really fed up of the stupid personal messages I get in my inbox. From today I am switching off the option of messages... I can understand that you all are hardcore fans, but please remember even celebrities are human beings with real emotion and we also get hurt and offended. Grow up guys!!!!”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu