ఈ సారైన జూ ఎన్టీఆర్ మీద పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడా..?
దసరా సీజన్‌లో జూ ఎన్టీఆర్, పవణ్ కళ్యాణ్ పోటీ పడగా, విజయం జూ ఎన్టీఆర్‌నే వరించింది. పవన్ కళ్యాణ్ కోమరం పులి ప్లాప్ అయిన, జూ ఎన్టీఆర్ బృందావనం మాత్రం కమర్షియల్‌గా మంచి హీట్ అయింది. ఈనేపద్యంలో మరోసారి బాక్సాఫీస్ బరిలోకి ఒకేసారి దిగుతోన్న ఈఇద్దరు హీరోల మద్య పోటీ చాలా ఆసక్తికరంగా మారునుంది. ఈసారైనా పవన్ కళ్యాణ్ పైచేయి శాదిస్తాడో లేదోనని మెగా అభిమానులలో ఉత్కంఠ నెలకోంది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి తీన్ మార్ చిత్రం ఏప్రిల్ 14న విడుదల అవుతుండగా, జూ ఎన్టీఆర్ తన శక్తిని చూపించడానికి మార్చి 30న రావడానికి సిద్దంగా ఉన్నారు. కేవలం రెండు వారాల వ్యవధుల్లోనే వస్తున్నటువంటి ఈరెండు సినిమాలపై టాలీవుడ్‌లో ఇప్పటికే ఆశక్తి నెలకోన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజిని బట్టి ప్లాపుల తర్వాత కూడా తీన్ మార్ చిత్రం బయ్యర్లను బాగానే ఆకర్షిస్తుంది.
ఇక ప్రస్తుతం వరుస హీట్స్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నటువంటి జూ ఎన్టీఆర్ శక్తి పై తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డుని బద్దలు కొడుతుందని అభిమానులు అంచనాతో ఉన్నారు. ఈసారి పోటా పోటీగా జరుగుతున్నటువంటి ఈసమ్నర్ సమరంలో పవన్ కళ్యాణ్ పంజా విసురుతాడో లేక జూ ఎన్టీఆర్ శక్తి ముందు తోక ముడుస్తాడో ఈరెండు సినిమాలు విడుదలయ్యే వరకు వేచిచూద్దాం.


Click it and Unblock the Notifications











