ఎమ్మెల్యే రోజాకు పోటీగా.. జనసేనలో మరో సీనియర్ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ న్యూ ప్లాన్?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రెగ్యులర్ పొలిటికల్ ఈవెంట్స్ తో కూడా బిజీ అవుతున్నాడు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలను లైన్ లో పెడుతున్న పవర్ స్టార్ జనసేన పార్టీని మరింత బలంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా పార్టీలో ఈసారి బలమైన కంటెస్టెంట్స్ ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక జనసేనలో త్వరలోనే ఒక సీనియర్ హీరోయిన్ అడుగు పెట్టె అవకాశం ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

ఓడినా తగ్గలేదు

ఓడినా తగ్గలేదు

జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఒక విధంగా ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని చూసినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. గతంలో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు పార్టీలు పెట్టి పదుల సంఖ్యలో సీట్లు వచ్చినా కూడా పార్టీలను ఇతర పార్టీలతో విలీనం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క సీటు మాత్రమే గెలిచినా అస్సలు తగ్గకుండా అధికార ప్రభుత్వానికి ధీటుగా ముందడుగు వేస్తున్నాడు.

 పవర్ఫుల్ గా సిద్దమవుతున్న జనసేన

పవర్ఫుల్ గా సిద్దమవుతున్న జనసేన

ఇక వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా విజయం సాధించాలి అని పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ సిద్ధం అవుతున్నాడు. ఇటీవల నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ భారీ స్థాయిలో క్లిక్కయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రణాళికలను వీలైనంత తొందరగా ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యారు. కొంతమంది సినీ ప్రముఖులు కూడా జంసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 ఎమ్మెల్యే రోజాకు పోటీగా..

ఎమ్మెల్యే రోజాకు పోటీగా..

ఇక నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సినీనటి రోజాకు విజయాలకు బ్రేక్ వేసేందుకు జనసేన పార్టీ పవర్ఫుల్ గా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు పోటీగా మరొక సీనియర్ హీరోయిన్ ను రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం స్థానిక నియోజకవర్గ కార్యకర్తలు కూడా పవన్ కు ఒక హీరోయిన్ పేరును ఎక్కువగా చెబుతున్నారా.

జనసేనలో మెగాస్టార్ హీరోయిన్..?

జనసేనలో మెగాస్టార్ హీరోయిన్..?

ఆ హీరోయిన్ మరెవరో కాదు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఘరానా మొగుడు సినిమాలో నటించిన వాణి విశ్వనాథ్ అని తెలుస్తోంది. ఆమె ఇటీవల నగరి నియోజకవర్గంలో సందడి చేసింది. ఒక దేవాలయానికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఆమెకు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. గతంలోనే టీడీపీ ఆమె వైపు ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇక ఇప్పుడు జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందొ లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X