పవన్ కళ్యాణ్ కి పాట్లు తప్పటం లేదు

By Srikanya

హైదరాబాద్ : నిన్న,మొన్నటివరకూ పొలిటికల్ క్యాంపైన్ లో బిజీగా తిరిగిన పవన్ తిరిగి సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన పొలిటికల్ క్యాంపైన్ లలో పోగొట్టుకున్న గ్లామర్ ని తిరిగి తెచ్చుకోవటానికి ప్రయత్నాలు మొదలెట్టారని సమాచారం. ఈ మేరకు ఆయన కొద్దిగా బరువు తగ్గాలని, పూర్తిగా డైట్ మీద దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఎక్సర్సైజ్ లు, డైట్ తో ఆయన తిరిగి అత్తారింటికి దారేది గ్లామర్ ని తీసుకువచ్చేపనిలో ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. గోపాల గోపాల షూటింగ్ కి వెళ్ళేలోగా ఈ బరువు తగ్గే కార్యక్రమం పూర్తి చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది.

Pawan Kalyan Focusing On Diet, Exercise To Lose Weight

వెంకటేష్, పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రంగా రూపొందిస్తున్న 'గోపాల.. గోపాల' ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.సురేష్‌బాబు, శరత్ మరార్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ పార్థసాని దర్శకుడు. ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్న అనూప్ రూబెన్స్ మరో వారంలో పాటల రికార్డింగ్ పూర్తిచేయనున్నారు.

మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ వినె్సంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X