పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు వివాహం
పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న ఆయన మొదటి భార్య నందిని వివాహం నిన్న(ఆదివారం) సాయింత్రం జరిగిందని సమాచారం. పెళ్ళి కుమారుడు హైదరాబాద్ కి చెందిన డా.కృష్ణారెడ్డి. ఈ వివాహం గ్రాండ్ కాకతీయ హోటల్ లో ఆదివారం సాయింత్రం ఎనిమిది ముప్పై ఐదు నిముషాలకు జరిగింది. నందిని తన పేరుని జాహ్నవి గా మార్చుకుంది. ఇక కృష్ణారెడ్డి(28) పింగళి రణధీర్ రెడ్డి, సుధ గార్ల కుమారుడు. ఇక పవన్ కళ్యాణ్, నందినల విడాకులు ఆగస్ట్ 12, 2008న సాంక్షన్ అయ్యాయి. నందినికి ఐదు కోట్ల రూపాయల మనోవర్తిని పవన్ కళ్యాణ్ చెల్లించారు. అప్పట్లో వ్యక్తిగత వివాదాలు ఉంటే ప్రజా రాజ్యం పార్టీకి ఇబ్బందులవుతాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన విడాకుల వివాదాన్ని పరిష్కరించుకున్నారు. నందినికి వివాహ శుభాకాంక్షలు ధట్స్ తెలుగు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











