‘వకీల్ సాబ్’ నుంచి సర్‌ప్రైజింగ్ న్యూస్: ఇందులో పవన్ కల్యాణ్ అలా కనిపిస్తాడట

సినిమాల్లోకి రీఎంట్రీ ప్రకటించినప్పటి నుంచి ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఒక సినిమా పట్టాలపై ఉండగానే మరికొన్నింటిని ప్రకటించిన ఆయన.. వాటన్నింటినీ ఏకకాలంలో పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' విడుదల కాకముందే పలు ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించేశాడు. ఇప్పుడు ఆయా చిత్రాల షూటింగులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ కనిపించనున్న గెటప్స్ గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రమే 'వకీల్ సాబ్'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ లాయర్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన మూడు గెటప్‌లలో కనిపిస్తాడని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ ఇందులో నాలుగో గెటప్‌లోనూ దర్శనమివ్వబోతున్నాడని మరో వార్త తాజాగా బయటకు వచ్చింది. అది సినిమాకే హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.

Pawan Kalyan Four Getups in Vakeel Saab

అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్'కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తుండగా.. శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. వేశ్యా గ‌ృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్ పాత్రను పవన్ పోషిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ విడుదలైన టీజర్, పాటలు వాటిని రెట్టింపు చేసేశాయి. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X