మళ్లీ ఆ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఛాన్స్.. ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత హార్స్ పవర్‌తో దూసుకుపోతున్నాడో చెప్పలేం. సినిమాల్లోకి రీ ఎంట్రీ అని చెప్పడమే తరువాయి.. వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేసుకుంటూ వెళ్లిపోయాడు. మళ్లీ ఆ కాంబోలు కూడా ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగేలానే ఉండటం ఆసక్తికరమైన అంశం. పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్‌కు వేణు శ్రీరామ్, క్రిష్ డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ చిత్రం.. హరీష్ శంకర్ కాంబోలో మరో చిత్రం ఇలా ప్రకటించుకుంటూ వెళ్లిపోయాడు.
కరోనా వచ్చింది కాబట్టి.. పవన్ కళ్యాణ్ సినిమాల సందడి కాసింత తగ్గింది. లేదంటే ఈ పాటికే వకీల్ సాబ్ దుమ్ములేపేది. క్రిష్ విరూపాక్షి కూడా షూటింగ్ జరుపుకుంటూ వార్తల్లో నిలిచేది. ఇలా పవన్ చిత్రాలన్నీ లైన్‌లో ఉండగా మరో ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇది వరకు రెండు స్లార్లు పవన్‌ను డైరెక్ట్ చేసిన డాలీ కిషోర్ కుమార్ పార్థసానికి మరో అవకాశం ఇచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మధ్యే డాలీ.. ఒక కథను పవన్‌కి వినిపించాడట. ఆ కథకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్ హీరోగా కిషోర్ కుమార్ పార్థసాని 'గోపాల గోపాల' .. 'కాటమరాయుడు' సినిమాలను తెరకెక్కించగా, 'గోపాల గోపాల'కి మంచి ఆదరణ లభించింది. ఇక కాటమరాయుడు ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మరి మూడోసారి చాన్స్ ఇచ్చాడని వస్తున్న వార్తలు ఒకవేళ నిజమే అయితే.. ఈ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











