పవన్ కళ్యాణ్ తాపత్రయం అంతా ‘ఖుషి’ చేయడానికే
పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలా మంది అగ్ర డైరెక్టర్లు సైతం క్యూలో నిలబడతారనేది తెలిసిన వాస్తవమే. కానీ పవన్ ఎప్పుడూ దానిని అలుసుగా తీసుకోలేదు. చిన్న డైరెక్టర్లకే అవకాశం ఇస్తూ పరిశ్రమ చల్లగా ఉండాలని కోరుకునే మనస్తత్వం పవన్ ది. కానీ పవన్ నే నమ్ముకున్న అభిమానులకి ఆ రేంజ్ సంతోషాన్ని ఈ డైరెక్టర్స్ ఇవ్వలేకపోవడంతో అభిమానులు పవన్ మార్గాన్ని తప్పుబడుతున్నారు.
పెద్ద డైరెక్టర్స్ అయితే పట్టి మరీ పవన్ లో టాలెంట్ ను లాగుతారని అందుకే చిన్న డైరెక్టర్లకే డేట్స్ ఇస్తాడని పవన్ మీద గాసిప్ కూడా ఉంది. వీటిన్నింటికి సమాధానం చెప్పడానికి కాబోలు విష్ణువర్థన్ తో చేస్తున్న 'కాళీ" (వర్కింగ్ టైటిల్) కోసం పవన్ చాలా కష్టపడుతున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులను ఈ సారైనా మంచి హిట్ తో 'ఖుషి" చేయాలనే తాపత్రయ పడుతున్న పవన్, డాన్స్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మాస్ ట్యూన్స్ కి డాన్స్ కూడా ఇరగదీశాడని సమాచారం. ఫైట్స్ కూడా వెరీ హార్డ్ గా ఉన్నాయని వాటి కోసం చాలా కష్టపడుతున్నాడని యూనిట్ సభ్యుల నుండి అంది సమాచారం. ఇదంతా వింటుంటు మరి రాబోతున్న 'కాళీ" పవన్ ఉగ్రరూపమే అనుకోవచ్చా..


Click it and Unblock the Notifications











