పవన్ కళ్యాణ్ కొత్త న్యూస్ ఛానల్! పేరేంటో తెలుసా ?
పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగ్రేటం చేసిన తరువాత కొంతమంది అతన్ని ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. శ్రీ రెడ్డి, వర్మ, కత్తిమహేష్ వంటివారు పవన్ ను ఎలా విమర్శిస్తున్నారో చూస్తున్నాం. వాటికి సమాధానంగా పవన్ తనదైనా శైలిలో విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ వస్తున్నారు. నిన్న ఆయన చాంబర్ లో చేసిన నిరసనకు మెగా హీరోలు అందరు మద్దతు తెలపడం విశేషం. తాజా సమాచారం మేరకు పవన్ కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ విమర్శలకు ప్రతివిమర్శలు
పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగ్రేటం చేసిన తరువాత కొంతమంది అతన్ని ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. శ్రీ రెడ్డి, వర్మ, కత్తిమహేష్ వంటివారు పవన్ ను ఎలా విమర్శిస్తున్నారో చూస్తున్నాం. వాటికి సమాధానంగా పవన్ తనదైనా శైలిలో విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ వస్తున్నారు. నిన్న ఆయన చాంబర్ లో చేసిన నిరసనకు మెగా హీరోలు అందరు మద్దతు తెలపడం విశేషం.

పవన్ కు కార్యకర్తల పిలుపు...
ప్రతి పార్టికి ఒక న్యూస్ ఛానల్ ఉంది. అంతర్గతంగా ఆ ఛానల్స్ సంభదిత పార్టీని ప్రచారం చేస్తూ ఉండడం కామన్. కాని జనసేనకు ఇంతవరుకు ఇటువంటిఛానల్లేదు. అందుకు గాను జనసేనకు సంభందించి ఒక కొత్త న్యూస్ ఛానల్ పెడితే బాగుంటుందని పార్టి నేతలు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు సూచించినట్లు సమాచారం.
పవన్ జనం కోసం ఛానల్...
తాజాగా వాట్సాప్ లో జే టీవీ అనే ఓ బ్యానర్ చక్కర్లు కొడుతోంది. 'జనం కోసం' ఇది ఛానల్ పేరు కాగా.. 'మీ కోసం.. మీ తోడుగా..' ఈ క్యాప్షన్ తో జే టీవీ అనే ఛానల్ రాబోతోందని ఈ పోస్టర్ ను చూడగానే తెలుస్తోంది. ఇది జనసేనకు సంభందించిన ఛానలని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ వార్తలో నిజం ఉందని సోషల్ మీడియాలో పలువురు సోషల్ మీడియాలో చెప్పుకోవడం విశేషం.
పవన్ సన్నిహితుడి కనుసైగాల్లో ఛానల్...
ఈ ఛానల్ లోగో డిజైన్ నుంచి.. బ్యానర్ లో కనిపిస్తున్న మిగిలిన అంశాలు పరిశీలిస్తే మాత్రం.. ఇది జనసేనకు అండగా నిలబడే ఉద్దేశ్యమే ఈ ఛానల్ వెనుక ఉంది అనే సందేహం కలగక మానదు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఈ ఛానల్ కు సంభందించిన పనులన్నీ చుసుకున్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనం కోసం ఛానల్ అధికారికంగా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి


Click it and Unblock the Notifications











