పవన్ కళ్యాణ్ మౌనం వెనుక దాగున్న గ్రేట్ ఫిలాసఫీ..!?
ప్రజారాజ్యం అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా ! అని 'పవన్ కళ్యాణ్' అన్నప్పుడు అది ఆవేశంతో అంటోన్న మాట అని, కచ్చితంగా పవన్ రాజకీయాల్లో కొనసాగుతాడని అనుకున్నారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోర పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతవరకు రాజకీయాల ఊసెత్తలేదు. ప్రజారాజ్యం కార్యక్రమాల్లో ఎక్కడా కనబడలేదు.ప్రతి పౌరుడికి రాజకీయ సృహ, సామాజిక సృహ వుండాలి అని ఎన్నికలకు ముందు స్పీచస్ లో దంచేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడ్రస్ లేడు..పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహించాడు అని అడిగే వాళ్లకు ఒకటే సమాధానం.
మేధావులు తమ అమూల్యమైన సమయాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా కాకుండా, స్వలాభాల కోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. వారిని ఎదిరించడం అంటే, నిప్పుతో చెలగాటం లాంటిదే. నిజాలను నిర్భయంగా మాట్లాడలేక, అవినీతిని అవినీతి తోనే ఎదుర్కొవలసిన దౌర్భగ్యస్థితిలో వున్నాం. సామన్యుడు ఏమీ చేయలేక మౌనం వహించవలసిన సమయం. న్యాయంగా పొరాడాలంటే అన్నీ వదిలేసుకొవాలి. ఎంత ఆవేశం ఆవేదన వున్నా, అన్నీ వదిలేసుకొని పొరాడవలసిన అవసరం పవన్‌కల్యాణ్‌కే కాదు, ఎవరికీ లేదు. రెచ్చగొట్టే వాళ్ళు, దోచుకునే వాళ్ళే హీరోలుగా చలామణి అవుతున్నప్పుడు, చేతనైతే రెచ్చగొడుతూ దోచుకొవాలి. అది చేతకానప్పుడు మౌనంగా వుండటమే బెటర్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో పరమేవ్వర ఆర్ట్స్ బ్యానర్ పై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న భారీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. త్రిష, కృతికర్భంతా మీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మార్క ఆఫ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదరహో అనిపించే రేంజ్ లో ఉండబోతుందట.


Click it and Unblock the Notifications











