Bro మూవీలో పవన్ పాత పాట రీమిక్స్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
టాలీవుడ్‌లో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎక్కువ మంది మెగా ఫ్యామిలీకి చెందిన వారే అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు మల్టీస్టారర్ మూవీలు చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటోన్నారు. వాళ్ల ఆశలను నిజం చేస్తూ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో (BRO)' అనే సినిమాను చేస్తోన్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న 'బ్రో (BRO)' మూవీలో మెగా హీరోలు కలిసి చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా, శరవేగంగా తీస్తున్నారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ కీలకమైన షెడ్యూల్‌ను జరుపుతున్నారు. ఇందులో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొంటున్నారు. ఇందులోనే ఓ స్పెషల్ సాంగ్‌ను సైతం షూట్ చేయబోతున్నారని తాజాగా తెలిసింది.

వపన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న 'బ్రో (BRO)' మూవీలో స్పెషల్ సాంగ్ హైలైట్‌గా ఉండబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. గతంలో వచ్చిన 'గుడుంబా శంకర్' మూవీలోని 'కిల్లి కిల్లి కిల్లి నమిలాక బాగున్నదే నాగమల్లి' అనే సాంగ్‌కు ఇది రీమిక్స్‌గా వస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్యూన్‌ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రెడీ చేసేశాడని తెలిసింది. ఇందులో దిశా పటానీ లేదా శృతి హాసన్ డ్యాన్స్ చేయబోతున్నారని తెలిసింది. ఈ పాటలో పవన్, తేజ్ ఇద్దరూ అదిరిపోయే స్టెప్పులు వేస్తారని టాక్.

మెగా హీరోల కాంబోలో వస్తున్న 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











