అక్కినేని అఖిల్ సినిమాలో పవన్ కళ్యాణ్!?

By Bojja Kumar

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఇటీవల సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తూండగా, నాగార్జున-నితిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అఖిల్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేందుకే ఈ విధంగా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 Pawan Kalyan guest role in Akhil's debut film?

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అమీర దస్తూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అమీర దస్తూర్ గతంలో హిందీ చిత్రంలో లో ప్రతీక్ బబ్బర్ సరసన చేసింది. అలాగే ప్రస్తుతం ధనుష్ సరసన కె.వి ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రం చేస్తోంది. మొదట్లో అలియా భట్ ని అనుకున్నా..ఆమె డేట్స్ దొరకకపోవటంతో ఈ హీరోయిన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

సాధారణంగా వినాయక్ సినిమాలంటే సుమోలు, చేజింగులు లాంటి బారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అయితే అఖిల్ తో చేస్తున్న ఈ సినిమా మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందట. వినాయిక్ మాట్లాడుతూ... ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్బుతమైన స్క్రిప్టు ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాధోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అభిమానులు కోరుకునే మాస్,మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X