రామ్ చరణ్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్
రామ్ చరణ్ ఓ ప్రక్క అల్లు అర్జున్ తో కలిసి చరణ్ అర్జున్ అనే చిత్రం చేయాలని ఉత్సాహపడుతూంటే...మరో ప్రక్క అతని చిత్రంలో పవన్ కళ్యాణ్ గెస్ట్ గా చేయనున్నాడని తెలుస్తోంది. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో రెడీ అయ్యే ఈ చిత్రం కోసం పవన్ ఓ కీలకమైన పాత్రను చేస్తానని మాట ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇంతకుముందు పవన్ తో బంగారం వంటి చిత్రాన్ని తీసిన ధరణి మళ్ళీ పవన్ తోనే చిత్రం చేయాలని అనుకున్నారుట. అయితే ప్రస్తుతం పవన్ డేట్స్ బిజీగా ఉన్నారని రామ్ చరణ్ ని ఎప్రోచ్ అయ్యారుట. అయితే పవన్ నీ కోరిక గెస్ట్ రూపంలో తీరుస్తారని అన్నారని చెప్తున్నారు.
ఇక మగధీరలో చిరంజీవి పాటలో కనపడినట్లుగా పవన్ అలా వచ్చి ఇలా వెళ్ళతాడా..లేక కథలో క్యారెక్టర్ లాగ వచ్చి ఎంటర్టైన్ చేస్తారా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. అలాగే పవన్ తో మెరపు నిర్మాతలు అన్నవరం చిత్రాన్ని గతంలో చేసారు. ఇక ఈ చిత్రం ఏప్రియల్ 30న లాంఛనంగా మొదలైంది. మెగా సూపర్ గుడ్ వారు నిర్మించే ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో చేస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ కెమెరా అందిస్తున్నారు. శ్రీరామ్...గతంలో ఖుషి, గీతాంజలి వంటి అధ్బుత ప్రేమకథలకు పనిచేసారు. ఇక తెలుగులో రెండేళ్ళ క్రిందట తేజ దర్శకత్వంలో వచ్చిన కేక చిత్రానికి పనిచేసారు.


Click it and Unblock the Notifications











