పవన్ పేరు చెప్పే క్రేజ్ తేవాలని ప్లాప్ హీరో...
పవన్ కళ్యాణ్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నాడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ డైరక్ట్ చేస్తున్న కృష్ణ వందే జగద్గురం చిత్రంలో పవన్ ని గెస్ట్ గా అడిగారని చెప్తున్నారు. పవన్ పేరు చెప్పి చిత్రానికి క్రేజ్ తేవాలని తాపత్రయపడుతున్నారట. వరస ప్లాప్ లతో ఉన్న రానా హీరోగా చిత్రం అంటే క్రేజ్ రాదని, అదే పవన్ లాంటి వ్యక్తి గెస్ట్ గా చేస్తున్నాడంటే వచ్చే క్రేజ్ వేరని ఈ ప్లాన్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
ఇక పవన్ ని అడిగిన పాత్ర ..సిబిఐ ఆఫీసర్ లక్ష్మి నారాయణని పోలి ఉంటుందని చెప్తున్నారు. కృష్ణ వందే జగద్గురం చిత్రం మైనింగ్ మాఫియా నేపధ్యంలో జరిగే కథ కాబట్టి..ఆ పాత్రకు ప్రయారిటి ఉంటుందని,పవన్ అయితే ఆ పాత్రకు ప్రాణం పోస్తాడని తెలిసి కలిసాడంటున్నారు. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు. గబ్బర్ సింగ్ క్రేజ్ లో ఉన్న పవన్ ని నటింపచేయటం ద్వారా తమ సినిమాలకు క్రేజ్ తెప్పించుకునే ప్లాన్ లో ఉన్నారు చాలా మంది నిర్మాతలు. కొందరు హీరోగా చేయటమని ఎప్రోచ్ అవుతూంటే మరికొందరు ఇలా గెస్ట్ గా అడుగుతున్నారు.
క్రిష్ మీడియాతో తన చిత్రంలో రానా పాత్ర గురించి మాట్లాడుతూ...అతని పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. అసలింతకీ ఈ బీటెక్ బాబు కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.
అలాగే ...ఒక మంచి స్క్రిప్ట్ నమ్మి గమ్యం చేశాను. మళ్ళీ అదే టీమ్‌తో ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా వుంది. ఖైదీ సినిమా చిరంజీవి గారికి ఎలా అయితే టర్నింగ్ పాయింట్ అయిందో, ఈ సినిమా రానాకు, నాకూ అలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా కథ ఐడియా జస్ట్ రెండు నిమిషాల్లో వచ్చింది. వెంటనే రానాకు ఫోన్ చేసి చెప్పాను. అతను మాత్రమే ఈ కథకు సూట్ అవుతాడు. గమ్యం, వేదంలలో గాలి శీను, కేబుల్ రాజును చూపించిన విధంగానే ఇందులో రానాని బీటెక్ బాబుగా చూపిస్తున్నాను. ఇది యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని అన్నారు.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.
హీరో రానా మాట్లాడుతూ...ఇది నాకు ఆరో సినిమా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఇందులో నా కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పాత్రను చేస్తుండటం చాలా ఆనందంగా వుందని అన్నారు. 'గమ్యం', 'వేదం'.. ఇవి రెండూ జీవితాల్లోంచి పుట్టిన కథలు. ఇది కూడా అలాంటిదే. అయినా వాణిజ్య అంశాలకు కొదవ ఉండదు''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











