తెరపైకి మళ్లీ పవన్ గుండు వ్యవహారం!

By Bojja Kumar

Pawan Kalyan gundu scene in Rowdy?
హైదరాబాద్: మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్ర ధారులుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రౌడీ'. ఈ చిత్రం స్టోరీకి....రాయల సీమకు చెందిన ప్యాక్షనిస్టు పరిటాల రవి స్టోరీకి కొంత సబంధం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. అయితే మెహన్ బాబు మాత్రం గతంలో చాలా సందర్భాల్లో ఈ వార్తలను ఖండించారు.

అయితే మోహన్ బాబు ఎంత మొత్తుకుంటున్నా....జరిగే ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో పరిటాల రవికి, పవన్ కళ్యాణ్‌కు మద్య గొడవ జరిగిందని...పవన్‌కి గుండు కొట్టించారనే రూమర్స్ కూడా అప్పట్లో రాజ్యమేలాయి. ఆ మధ్య వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర చిత్రంలో ఇలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా 'రౌడీ' చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉండే అవకాశం ఉందనే వదంతులు వ్యాపించాయి.

రౌడీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఈ పరిణామాలు పరిశీలిస్తే...పవన్ కళ్యాణ్ అంటే గొట్టని ఓ వర్గం కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో కావాలనే అతనిపై ఇలాంటి రూమర్స్ స్ర్పెడ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

రౌడీ సినిమా విషయానికొస్తే....మంచు మోహన్‌బాబు, విష్ణు, జయసుధ, శాన్వి ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X