Sai Dharam Tej Accident : ఆ రాత్రంతా నిద్ర లేకుండానే పవన్..

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులందరి కంటే ముందు హాస్పిటల్ కి చేరుకున్నారు తనకు సన్నిహితులైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి హాస్పిటల్ కి వచ్చిన ఆయన నిద్రలేని రాత్రి గడిపినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి వెళ్తున్న క్రమంలో సాయి ధరమ్ తేజ్ ఇసుక మీద బైక్ ఎక్కడందో కోహినూర్ హోటల్ వద్ద రోడ్డు మీద స్కిడ్ అయ్యి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిన ఆయనను మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఆయనను మెగా కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్ కి తరలించారు.

హుటాహుటిన పవన్

హుటాహుటిన పవన్

అయితే నిజానికి అపోలో హాస్పిటల్ కు తరలించడానికి కంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి హాస్పిటల్ కి రావడమే కాక వెంటనే సాయి ధరమ్ తేజ్ ని పరిశీలించి ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్లో వివరాలు అందించారు. అయితే సాయి ధరమ్ తేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని అపోలో వైద్యులు చెప్పే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోలేదని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

సన్నిహితంగా

సన్నిహితంగా

నిజానికి పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ కూడా గతంలో అనేక సార్లు ప్రస్తావించారు కూడా. రీసెంట్ గా యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ వీడియోలో తాను బైక్ కొనుక్కున్న వెంటనే దాన్ని తీసుకెళ్లి పవన్ మామయ్యకు చూపించానని దానిని చూసిన ఆయన అడిగిన మొదటి ప్రశ్న హెల్మెట్ పెట్టుకున్నావా? జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పారని చెప్పుకొచ్చాడు.

ఆ రాత్రంతా నిద్ర లేదట

ఆ రాత్రంతా నిద్ర లేదట

అలా వీళ్లిద్దరి మధ్య చాలా బాండింగ్ ఉండగా ఆ బాండింగ్ నేపథ్యంలోనే పవన్ కి ఆ రాత్రంతా నిద్ర లేదని అల్లుడికి ఏం జరుగుతుందో అనే టెన్షన్ లోనే ఆ రాత్రంతా గడిపారు అని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి ఉండరు, ఆయన ఏకాంతంగా ఫామ్ హౌస్ లో గడుపుతూ ఉంటారు. అయినా సరే ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం మాత్రం తెలుసుకుంటూనే ఉంటారు.

Recommended Video

Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Filmibeat Telugu
ఫోన్ టచ్లో

ఫోన్ టచ్లో

కుటుంబానికి చాలా విలువ ఇచ్చే పవన్ కళ్యాణ్ తన మేనల్లుడికి ఇలా జరగడం నేపథ్యంలో చాలా బాధ పడుతున్నారని అంటున్నారు. ఇప్పటికే మిగతా కుటుంబ సభ్యులు ప్రతి పూట అపోలో హాస్పిటల్ కి వెళ్లి సాయి ధరమ్ తేజ్ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు హాస్పిటల్ దగ్గరికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా ఎవరు హాస్పిటల్ కి వెళ్ళిన వారితో పవన్ కళ్యాణ్ ఫోన్ టచ్ లోనే ఉంటున్నారు అని, పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకునే ఉన్నారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X