పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్లే రాస్తున్నాడు

'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్ సింగ్‌గా పవన్ కల్యాణ్ చేసిన సందడి ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్ సింగ్'కి రెండో భాగం రూపుదిద్దుకోబోతోంది. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తారు.
ఈ నెలలోనే 'గబ్బర్ సింగ్ 2' సెట్స్ మీదకు వెళ్లబోతోందని సమాచారం . ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్నారు. ఆ వెంటనే ఆ ఇద్దరి కాంబినేషన్‌లోనే 'కోబలి' ఉంటుందనుకున్నారు. అంతకంటే ముందే 'గబ్బర్‌సింగ్ 2' ప్రారరభమవుతుంది. ఆ తరవాతే 'కోబలి'కి రంగం సిద్ధమవుతుంది.
గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అయితే భవిష్యత్‌లో పవర్ స్టార్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











