»   » రెండు సార్లు దెబ్బతిన్నా...పవన్ కళ్యాణ్ మారలేదా?

రెండు సార్లు దెబ్బతిన్నా...పవన్ కళ్యాణ్ మారలేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో చేసే పని హీరో చేయాలి, డైరెక్టర్ చేసే పని డైరెక్టర్ చేయాలి. కొన్ని సార్లు డైరెక్టర్ చేయాల్సిన పని కూడా హీరోగారే చేస్తుంటారు. మరికొన్ని సార్లు స్క్రిప్టులో వేలు పెట్టి గెలుకుతుంటారు.. కథలో కాలు పెట్టి కకలావికలం చేస్తుంటారు.

ఇలా హీరోగారు చేసే ప్రయోగాల వల్ల ఆయా సినిమాల పరిస్థితి బాక్సాఫీసు వద్ద ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ పవన్ కళ్యాణ్ స్వయ దర్శకత్వంలో వచ్చిన 'జానీ' సినిమాతో పాటు, ఇటీవల ఆయన స్క్రీన్ ప్లే అందించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలే నిదర్శనం.

ఇలా సినిమా స్క్రిప్టులో వేలు పెట్టి గెలికి రెండు సార్లు దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ మరోసారి తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుండి. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ...ఈ వార్త విన్న అభిమానులు, సినీ జనాల్లో కంగారు మొదలైంది. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ లో టాలెంట్ లేదని కాదు, కాకపోతే ఇది సెంటిమెంటల్ గా వర్కౌట్ కావడం లేదనే వారి బాధ.

ప్రస్తుతం ఆయన డాలి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసి నష్టపోయిన శరత్ మరారే ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా ద్వారా ఎలాగైనా తన స్నేహితుడు శరత్ ను నష్టాల నుండి గట్టెక్కించాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్. మరి ఇది జరుగాలంటే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే, స్క్రిప్టులో వేలు పెట్టక పోవడమే మంచిదని అంటున్నారు.

ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాలు స్లైడ్ షోలో...

చేతులు మారింది

చేతులు మారింది


ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎస్.జె.సూర్య చేతి నుండి డైరెక్టర్ డాలీ(కిషోర్ పార్ధసాని... గోపాల గోపాల ఫేం) చేతిలోకి వచ్చింది.

స్పెషల్ కేర్

స్పెషల్ కేర్


'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ రిజల్ట్ అంచనాలను తారుమారు చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై చాలా కేర్ తీసుకుంటున్నారు.

మిస్సవ్వొద్దు

మిస్సవ్వొద్దు


'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా విషయంలోనూ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా జాగ్రత్తగానే తీసినప్పటికీ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ మిస్సవ్వడమే దెబ్బతీసిందని భావించిన పవన్ కళ్యాణ్ అండ్ టీం తాజా సినిమాలో అవన్నీ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ మెచ్యూర్ క్యారెక్టర్

పవన్ కళ్యాణ్ మెచ్యూర్ క్యారెక్టర్


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ డాలీ ఈ సినిమాను గుడ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఒక ఫ్యాక్షనిస్టుకి, అందమైన విలేజ్ అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. సినిమా మొత్తం రూరల్ బ్యాక్ డ్రాపులో సాగుతుంది, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా మెచ్యూర్ గా డిజైన్ చేసారు.

ఆందోళన

ఆందోళన


అయితే పవన్ కళ్యాణ్ స్క్రిప్టులో వేలు పెడుతున్నాడని తెలిసి అభిమానులు హడలిపోతున్నారు.

English summary
Looks like Pawan Kalyan haven't had learnt a lesson from the debacles of Johnny and Sardaar Gabbar Singh or is it that he wants to prove himself by taking another chance? Though we are not yet sure what made Pawan Kalyan to turn a screenplay writer again, we have been hearing a lot from a few reliable sources that the actor will be taking up the responsibilities of a screen writer for his next film as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu